Advertisement
Google Ads BL

అందరూ సంక్రాంతినే టార్గెట్‌ చేస్తే.. థియేటర్లు ఎలా?


ఈ దసరాకి విడుదల కావాల్సిన సినిమాలన్ని ఓటీటీలో విడుదలైపోతున్నాయి. మార్చి నుండి ఇప్పటివరకు విడుదల కావాల్సిన చాలా సినిమాలు ఓటీటీలో విడుదల కాగా రామ్ లాంటి వాళ్ళు థియేటర్స్ కోసం వేచి చూస్తున్నారు. చాలామంది షూటింగ్స్ కంప్లీట్ అయినా సినిమాలు కూడా థియేటర్స్ తెరుచుకున్నా సినిమాలు విడుదల చేయడం లేదు. దసరా థియేటర్స్ కళకళలన్నీ బోసిపోయాయి. బాక్సాఫీసు నీరసపడిపోయింది. అయితే దసరాకి ఫస్ట్ లుక్స్ తో టీజర్స్ తో హడావిడి చేసిన స్టార్స్ చాలామంది తమ సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు.

Advertisement
CJ Advs

దసరా, సంక్రాంతి పండగలు సినిమాలకి పెద్ద ప్లాట్ ఫారం. అలాంటిది దసరా కరోనాకి దొరికిపోగా.. హీరోలంతా సంక్రాంతి మీదే ఆశలు పెట్టుకున్నారు. అందరి కన్నా ముందే రానా అరణ్య సినిమాని సంక్రాంతికి విడుదల అని అనౌన్స్ చెయ్యగా.. దసరా రోజున రవితేజ క్రాక్ ని సంక్రాంతికి విడుదల చెయ్యబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేనా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా సంక్రాంతే. ఇక మార్చిలో విడుదల కావాల్సిన రామ్ రెడ్ ఓటీటీకి దొరక్కుండా సంక్రాంతికి కర్చీఫ్ వేసేశాడు. ఇక నితిన్ కూడా రంగ్‌దేని సంక్రాంతి అని ఎప్పుడో చెప్పాడు. మరి ఇన్ని సినిమాలు సంక్రాంతికి అంటుంటే.. మిగతా సినిమాలు సంక్రాంతికి విడుదల అంటే థియేటర్స్ దొరకవేమో.. అందులోను కన్నడ కెజిఎఫ్ కూడా సంక్రాంతికే అంటున్నారు. 

మరి ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాలతో సంక్రాంతికి బాక్సాఫీసు షేకాడేది. కానీ ఈసారి భారీ లేదు.. చిన్న లేదు... మీడియం లేదు అన్ని కలగలుపు. అయితే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు ఎన్ని అనేది డిసెంబర్‌కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

Tollywood Heroes eye on Sankranthi:

So many movies in Sankranthi 2021 race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs