Advertisement
Google Ads BL

హమ్మయ్యా.. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆ తేడాల్లేవ్‌!


రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోస్. ఇద్దరికీ ఇంచుమించు అభిమానుల సంఖ్య కూడా అటు ఇటుగా ఉంటారు. మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్యన తరాల నుండి వార్ జరుగుతుంది. కానీ అదే మెగా హీరో - నందమూరి హీరో కలిసి ఒకే సినిమాలో నటించేస్తున్నారు. ఇద్దరు హీరోలు మంచి ఫ్రెండ్స్ కూడా. అదే ఫ్రెండ్ షిప్ సినిమాలో వాడేశా అని రాజమౌళి చెప్పాడు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోను, రామ్ చరణ్ ఫ్యాన్స్ లోను RRR సినిమాలో రాజమౌళి ఏ హీరోకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తాడు, ఏ హీరోకి స్క్రీన్ స్పేస్ తక్కువ ఇస్తాడు. అసలు ఇద్దరిని సమానంగా చూపించడం సాధ్యమేనా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు దాచుకున్నారు. ఇక రామ్ చరణ్ కేరెక్టర్ కన్నా ఎన్టీఆర్ కేరెక్టర్ ఎక్కువ ఉంటే? ఎన్టీఆర్ భీం కేరెక్టర్ కన్నా చరణ్ అల్లూరి పాత్ర ఎక్కువ ఉంటే? ఇలా ఏదో ఒక విషయంలో ఏదో ఒక అనుమానం.

Advertisement
CJ Advs

అయితే మార్చిలో చరణ్ బర్త్‌డేకి రామ్ చరణ్ అల్లూరి వీడియోని RRR టీం విడుదల చేసింది. రామ్ చరణ్ వర్కౌట్స్ చేస్తూ.. అల్లూరి పాత్రని పవర్ ఫుల్ గా అంటే మండే అగ్ని కణంలా పరిచయం చేసింది. ఇక తాజాగా ఎన్టీఆర్ కొమరం భీం వీడియోని దసరా కానుకగా విడుదల చేసింది. అందులోను ఎన్టీఆర్ కండలు, మేకోవర్ అద్భుతం.. ఎన్టీఆర్ ని అలా చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాటల్లేవ్. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కండలు తిరిగిన బాడీలో కనిపించగానే మెగా ఫ్యాన్స్ కి పూనకలొచ్చేశాయ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త భయపడ్డారు. 

కానీ ఎన్టీఆర్ వీడియో చూశాక వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్, ఎన్టీఆర్ RRR వీడియోస్ ఒకేలా ట్రెండ్ అయ్యాయి. ఇక రికార్డులు అటు ఇటుగా ఉంటాయి.. కానీ అటు చరణ్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ గా ఉన్నారు. RRR లో ఏ హీరో తక్కువ కాదు, ఎక్కువ కాదు అని ఇప్పటికి ఫిక్స్ అయ్యారు.

Mega and Nandamuri Fans Happy with RRR heroes intro teasers:

Rajamouli balanced Mega and Nandamuri Heroes in RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs