Advertisement
Google Ads BL

నాన్న హెల్త్‌పై అసత్య వార్తలు ఆపండి: శివాత్మిక


కొన్ని రోజుల క్రితం హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలు సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. అయితే తర్వాత కరోనా నుండి తాము కోలుకున్నట్టుగా చెప్పారు. తాజాగా రాజశేఖర్ కరోనా పోరాటంలో ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉందని... లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తగ్గలేదని, రాజశేఖర్ పరిస్థితి బాలేదని ఆయన కూతురు సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో అయన అభిమానులు రాజశేఖర్ కోలుకోవాలనంటూ పూజలు మొదలు పెట్టారు. అయితే రాజశేఖర్ కరోనా తో పోరాటం చేస్తున్నారని.. దానికి అయన చాలా ఇబ్బంది పడుతున్నారని మాత్రమే శివాత్మిక ట్వీట్ ఉంది.

Advertisement
CJ Advs

కానీ ఆయన కండిషన్ సీరియస్ అంటూ.. మీడియాలో వార్తలు రావడంతో తండ్రి ఆరోగ్యంపై మరింత స్పష్టతనిస్తూ శివాత్మిక మరో ట్వీట్ చేసింది... తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని.. మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. కాకపోతే. ఇక్కడ విషయం ఏమంటే.. మా తండ్రి గారి పరిస్థితి విషమంగా లేదు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. అంతేకాదు కోలుకుంటున్నారు కూడా. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాన్న ఆరోగ్య పరిస్థితిపై అసత్యవార్తలను ప్రచారం చేయకండి అంటూ ట్వీట్ చెయ్యడంతో రాజశేఖర్ పరిస్థితిపై అందరికి క్లారిటీ వచ్చింది.

Shivathmika Rajashekar Clarity about Rajasekhar Health:

Rajasekhar Not Critical, Don’t Spread Fake News Says his Daughter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs