Advertisement
Google Ads BL

బిగ్ బాస్: ఈ వారం హోస్ట్ గా ఎవరొస్తారో..?


బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలై మంచి జోష్ తో ముందుకు సాగుతుంది. గతంలో కంటే ఎక్కువ రేటింగ్స్ తెచ్చుకుంటూ, ఒక పక్క ఐపీఎల్ నడుస్తున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. ఐతే గత వారం నుండి బిగ్ బాస్ యాజమాన్యంపై ప్రేక్షకుల్లో ఒకరకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. హౌస్ లో ఉన్న కొందరి కంటెస్టెంట్ల పట్ల పక్షపాతంగా వ్యవహరించి అనవసరంగా నిజాయితీగా గేమ్ ఆడేవాళ్ళని బయటకి పంపించేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.

Advertisement
CJ Advs

నిజంగా ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే అదంతా పక్కన పెడితే ఈ వారం వ్యాఖ్యతగా నాగార్జున కనిపించడని అంటున్నారు. వైల్డ్ డాగ్ చిత్రీకరణ నిమిత్తం హిమాలయాలు వెళ్తున్నాడని, అందువల్ల ఈ వారం నాగార్జున అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. గత సీజన్లోనూ ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు సీనియర్ హీరోయిన్ రమ్యక్రిష్ణ వ్యాఖ్యాతగా కనిపించి మెప్పించారు.

మరి ఈ సారి వ్యాఖ్యాతగా ఎవరొస్తారనేది ఆసక్తిగా మారింది. రమ్యక్రిష్ణ వ్యాఖ్యాతగా చేసినపుడు మంచి అప్లాజ్ వచ్చింది. మరి ఈ సారి కూడా రమ్యక్రిష్ణ నే పిలుస్తారా లేదా మరెవరైనా వ్యాఖ్యాతగా వస్తారనేది చూడాలి.

Bigg Boss: Who will be come as host..?:

Bigg Boss: Who will be come as host..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs