Advertisement
Google Ads BL

ఆర్ఆర్ఆర్: వెయిటింగ్ ఫర్ రామరాజు వాయిస్


దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర రామరాజు ఫర్ భీమ్ టీజ‌ర్ ఈ నెల 22న విడుద‌ల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ టీజ‌ర్ విడుదల కోసం మెగా, నందమూరి అభిమానులే కాదు.. ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురుచూస్తుంది. దీనికి కార‌ణం ఈ చిత్రానికి సంబంధించిన మొద‌టి టీజ‌ర్‌లో చ‌ర‌ణ్ వ‌ర్క‌వుట్స్ చేయ‌టం, యాక్ష‌న్ పార్ట్ చూపించ‌టం దానికి ఎన్‌టి‌ఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌టం చాలా హైలెట్ అయ్యింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. 

Advertisement
CJ Advs

 

అభిమానుల మధ్య వాగ్వివాదాలు

అదేంటి అసలు కథ ఇప్పుడు మొదలవ్వడం ఏమిటి అనుకుంటున్నారు కదా!. అంటే ఇప్ప‌డు రివ‌ర్స్ గేమ్ స్టార్టయ్యింది. ఈసారి ఎన్‌టిఆర్ యాక్ష‌న్‌కి రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య కొంత యాక్ష‌న్ స్టార్ట‌య్యింది. మా హీరో యాక్ష‌న్ బాగుంది, మా హీరో వాయిస్ ఓవర్ వ‌ల్లనే టీజ‌ర్ బాగుందనే ఆర్గ్యూమెంట్స్ అక్కడక్కడా వినబడుతుండటంతో పాటు కొన్ని చోట్ల దీనిపై వాగ్వివాదాలు మొద‌ల‌య్యాయని అంటున్నారు. 

 

తమ్ముడు భీమ్ కోసం అన్న రామరాజు

మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇప్పుడు భీమ్ టీజర్ కోసం వాయిస్ ఓవర్ చెప్పారని.. కొన్ని రోజులుగా రామరాజు ఫర్ భీమ్ అని ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక్క‌డ ఆశ్చ‌ర్యం ఏమిటంటే మెగా ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్ కూడా రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవర్ కోస‌మే వెయిట్ చేస్తుండటం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చాలా కేర్ తీసుకుని రామ్ చరణ్ ఈ టీజర్‌కు వాయిస్ ఓవ‌ర్ చెప్పాడ‌ంట. చరణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ రేంజే మారిపోయిందని, మెగానందమూరి అభిమానుల మధ్య వాగ్వివాదాలన్నింటికి ఈ టీజర్ చెక్ పెట్టబోతోందనే టాక్ నడుస్తోంది.

Mega and Nandamuri fans waiting for RRR Ramaraju Voice:

All eyes on Ram Charan voice over for Bheem 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs