బాలకృష్ణ కరోనాకి భయపడకుండా ఎప్పుడో షూటింగ్‌కి రెడీ అని, రామోజీ ఫిలిం సిటీలో బోయపాటి సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొనబోతున్నాడనే న్యూస్ నడిచింది. కానీ కరోనా పరిస్థితులు ఇంకా కొలిక్కి రాని కారణంగా సీనియర్ హీరోలు ఎవరూ షూటింగ్‌కి రెడీ కావడం లేదు. అందులోనూ హైదరాబాదులో వరదలు రావడం ఇంకా పరిస్థితులు అనుకూలించకపోవడంతో షూటింగ్స్ చాలా వాయిదా పడినాయి. అయితే బాలకృష్ణ, బోయపాటి మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడా అని ఎదురు చూస్తున్నాడు కానీ.. బోయపాటి మాత్రం ఇంకా షూటింగ్‌కి సిద్ధం కాలేదట. కారణం ఒకటి హీరోయిన్ అయితే ఇంకా మిగతావి నటులు అలాగే విలన్ ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తుంది.
నిన్నగాక మొన్న బాలయ్య కోసం బోయపాటి ఓ హీరోయిన్‌ని ఫైనల్ చేశాడనే న్యూస్ నడిచింది. కానీ హీరోయిన్ విషయం ఇంకా తెగలేదని.. నెలరోజులుగా బోయపాటి తన ఆఫీస్‌లో హీరోయిన్స్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడని.. అలాగే బాలయ్య కోసం ఇంకా పవర్ ఫుల్ విలన్‌ని కూడా బోయపాటి సెట్ చెయ్యలేదని, కెమెరామెన్, ఫైట్ మాస్టర్లు, సంగీత దర్శకుడు తప్ప మిగతా టెక్నికల్, అలాగే కీలక పాత్రలకి నటులు ఫైనల్ అవ్వలేదని.. కేవలం బాలయ్య పుట్టిన రోజున విడుదల చెయ్యాలనుకున్న BB3 టీజర్ కోసం ఓ షెడ్యూల్ వేసుకుని షూటింగ్ చేశాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు నటుల ఎంపిక బోయపాటికి సవాల్‌గా మారిందని.. వాళ్ళ డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడం కష్టంగా మారిందని అంటున్నారు. బాలయ్య అయితే దసరా తర్వాత BB3 షూటింగ్ మొదలెట్టాలని అనుకుంటున్నాడట. కానీ అప్పటికి బోయపాటి రెడీ అవుతాడో? లేదో? అంటున్నారు.