Advertisement
Google Ads BL

‘రెడ్‘ రిలీజ్‌కు రామ్ కూడా రాం రాం..!


మార్చిలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ ఎట్టకేలకు ఓటీటీలలో విడుదలైపోతున్నాయి. ఒక్కొక్కటిగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్‌లో సందడి చేసేశాయి. చేస్తున్నాయి. నాని వి, అనుష్క నిశ్శబ్దం, కలర్ ఫోటో ఇలా వరసబెట్టి ఓటీటీలో విడుదలవుతున్నాయి. మరో పక్క మొన్న 15 నుండి థియేటర్స్ ఓపెన్ అయినాయి. థియేటర్స్ ఓపెన్ అయినా పూర్ రెస్పాన్స్ రావడంతో హీరోలెవరు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి సాహసం చేయడం లేదు. థియేటర్స్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్, కేంద్రం ఇచ్చిన నిబంధనలకు హీరోలు ఒప్పుకోవడం లేదు. అందుకే సినిమాల విడుదల ఆపేశారు. లేదంటే దసరా సీజన్ వదులుకోవడానికి హీరోలెవరూ ఇష్టపడరు.

Advertisement
CJ Advs

అయితే రామ్ మాత్రం అటు ఓటీటీకి ఇటు థియేటర్స్‌కి కూడా లొంగడం లేదు. రామ్ తాజా చిత్రం ‘రెడ్’ మార్చి‌లోనే విడుదల కావాలి. కానీ కరోనా రావడంతో వాయిదా పడినా.. ఓటీటీలకు అమ్మకుండా రామ్ థియేటర్స్ కోసం కాచుకుని కూర్చున్నాడు. కానీ ఇప్పుడు థియేటర్స్ లో రెడ్ ని దింపడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇస్మార్ట్ హిట్ అవడంతో రామ్ రెడ్ మీద భారీ అంచనాలు పెట్టుకోవడంతో.. థియేటర్స్ లోనే రెడ్ దింపాలని చూస్తున్నాడు. కానీ థియేటర్స్ ఓపెన్ అయినా రామ్ రెడ్ విడుదలయ్యే పరిస్థితి లేదు. అయినా రామ్ కాన్ఫిడెంట్ ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది బహుశా రామ్ కూడా గెస్ చెయ్యలేకపోతున్నాడేమో..

Ram Red movie release in doubts :

Red Movie Release; confusion continues..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs