Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కోసం ఆ ఇద్దరు హీరోయిన్లు..?


అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. హీరోలంతా త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో మూవీ అనౌన్స్ చేసేశాడు. లైన్ లో మహేష్ వచ్చేశాడు. మహేష్, త్రివిక్రమ్‌తో మూవీ ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు. ఇక అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్‌తో మూవీ చెయ్యాలనుకుంటున్నాడట. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్స్ సెలెక్షన్స్ లో ఉన్నాడట. ప్రతిసారి హీరోయిన్స్ ని రిపీట్ చేసే అలవాటున్న త్రివిక్రమ్ మరోమారు ఈ రిపీట్ కార్యక్రమంలోనే ఉన్నాడట.

Advertisement
CJ Advs

అంటే అరవింద సమేత - అల వైకుంఠపురములో తర్వాత మరోసారి ఎన్టీఆర్ సినిమాలో పూజాహెగ్డేకి, త్రివిక్రమ్ అవకాశం ఇవ్వబోతున్నాడని టాక్ ఉండగా... ఇప్పుడు ‘అత్తారింటికి దారేది - సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల్లో నటింపచేసిన సమంతని ఎన్టీఆర్ సినిమా కోసం పరిశీలనలో ఉంచాడట త్రివిక్రమ్. ముందు నుండి బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ పేరు వినిపించినా ఇప్పుడు త్రివిక్రమ్ మదిలో పూజాహెగ్డే ఓ హీరోయిన్ గాను, సమంత మరో హీరోయిన్ గాను ఉన్నారని టాక్. పెళ్లి తర్వాత స్టార్ హీరోల సినిమాలకు దూరంగా ఉంటున్న సమంతతో త్రివిక్రమ్ సంప్రదింపులకు దిగాడని ఫిలింనగర్ టాక్.

Two Heroine in Jr NTR And Trivikram Combo Film:

Samantha and Pooja Hegde for NTR And Trivikram Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs