Advertisement
Google Ads BL

కరోనా ఎఫెక్ట్: నాని నిర్మాత మారుతున్నాడా?


నాని అంటే మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతల పాలిట బెస్ట్ హీరో. నిర్మాతలు నాని మీద బడ్జెట్ పెడుతున్నారంటే.. కూల్ గా ఉంటారు. నాని మీద బడ్జెట్ పెట్టేంత సేఫ్ మరే హీరోకీ ఉండదని నమ్ముతారు. కెరీర్ లో చిన్న చితక ప్లాప్స్ ఉన్నప్పటికీ.. నాని సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారని మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంసీఏ నిరూపించింది. అయితే ఇప్పుడు నాని మీద బడ్జెట్ పెట్టేందుకు ఓ నిర్మాణ సంస్థ కిందా మీద పడుతుందట. మరి కరోనా కారణమా? లేదంటే నాని మీద నమ్మకం లేకనో కానీ.. నాని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ కాంబోలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆలోచనలో పడిందట.

Advertisement
CJ Advs

కాస్త భారీ బడ్జెట్ తో మొదలైన  శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగడం మొదలు కావడం మళ్లీ కరోనా వలన షూటింగ్ ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్తన్ తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగరాయ్ బడ్జెట్ కాస్త ఎక్కువేనట. సబ్జెక్టు నచ్చి సినిమా మొదలెట్టిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఇప్పుడు ముందు అనుకున్న బడ్జెట్ పెట్టాలంటే కష్టమంటున్నారట. 

లాక్ డౌన్ తో అన్ని తారుమారవడంతో ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కూడా శ్యామ్ సింగరాయ్ బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా వెబ్ మీడియా, సోషల్ మీడియా టాక్. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బడ్జెట్ విషయంలో తికమకలు పడడంతో నాని కథ మీదున్న నమ్మకంతో ఈ సినిమాని మరో నిర్మాత చేతికి అప్పజెప్పినట్టుగా న్యూస్ మొదలయ్యింది.

Corona effect: Nani Movie producer changed:

Budget Problems to Nani&nbsp;<span>Shyam Singha Roy</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs