Advertisement
Google Ads BL

రవితేజ ఖిలాడిపై ఈ వార్తలేంటి?


రవితేజకి వరసగా ప్లాప్స్ తగులుతున్నప్పటికీ... సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. వరసబెట్టి సినిమాలను ఎనౌన్స్ చేస్తున్న రవితేజ తాజాగా రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఖిలాడీ సినిమాని మొదలెట్టేశాడు. గోపీచంద్ మలినేనితో రేపో మాపో క్రాక్ షూటింగ్ ఫినిష్ చేసుకుని రవితేజ ఖిలాడీ షూటింగ్ లోకి దిగిపోతాడట. అయితే ఖిలాడీగా రవితేజ కొత్తగా కనిపిస్తున్నాడు. కాకపోతే రమేష్ వర్మ రవితేజ ఖిలాడీ సినిమాని సొంత కథతోనో స్ట్రయిట్ కథతోనో సినిమాని తెరకెక్కించడం లేదని.. రవితేజ ఖిలాడీ ఓ రీమేక్ అంటూ ప్రచారం మొదలయ్యింది. మామూలుగానే రమేష్ వర్మ చేసిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్స్ ఉంటాయి. సొంత కథలతో తీసిన సినిమాలు ప్లాప్ అవడంతో రమేష్ వర్మ ఎక్కువగా రీమేక్స్ నే ఇష్టపడుతున్నాడు.

Advertisement
CJ Advs

అందుకే రవితేజ ఖిలాడీని కూడా రమేష్ వర్మ ఓ తమిళ మూవీని రీమేక్ చెయ్యబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలయ్యింది. తమిళంలో అరవింద్ స్వామి - త్రిష కలయికలో తెరకెక్కిన శతురంగ వేట్టై 2 ని రమేష్ వర్మ రవితేజ హీరోగా ఖిలాడీగా రీమేక్ చేయబోతున్నాడట. గతంలో వచ్చిన శతురంగ వేట్టై తమిళంలో సూపర్ హిట్ అవ్వగా.. దానికి సీక్వెల్ గా శతురంగ వేట్టై 2 తీశారు. కానీ ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. 

ఇప్పుడు అదే సినిమాకి రీమేక్ గా ఖిలాడీ ఉండబోతుంది అని.. రవితేజ - రమేష్ వర్మ ఇద్దరూ శతురంగ వేట్టై 2 గురించి తెలుసుకుని ఆ సినిమా చూసి హిట్ అవుతుందని నమ్మాకే రీమేక్ చెయ్యడానికి సిద్దమయ్యారట. మరి ఖిలాడీ సినిమా శతురంగ వేట్టై 2 కి రీమేక్ నిజామా కదా అనేది రవితేజ స్పందనతోనే తెలుస్తుంది సుమీ.

Ravi Teja’s Khiladi Is Remake Of Sathuranga Vettai 2:

Exclusive: Khiladi Is Remake Of A Scrapped Film!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs