Advertisement
Google Ads BL

రీమేక్స్‌పై చిరుకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి?


చిరంజీవి తొమ్మిదేళ్లు రాజకీయాలంటూ సినిమాలను పక్కనబెట్టి.. కత్తి రీమేక్ తో మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమా చేశాడు. అయితే చిరంజీవికి స్ట్రయిట్ కథలో సినిమాలు చేస్తే హిట్ పడదని అర్థమైందా... లేదంటే సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాడా? అనేది అర్ధం కావడం లేదు. ఎందుకంటే చిరంజీవి ఎక్కువగా రీమేక్‌లే పచ్చజెండా ఊపుతున్నాడు. సైరా దెబ్బ చిరు మార్చేసిందా? ఏమో ఏదైనా చిరు రీమేక్స్ అంటూ ఊగుతున్నాడు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాని కొరటాలతో చేస్తున్నాడు. తర్వాత మలయాళ లూసిఫర్ రీమేక్ అన్నప్పటికీ... అది పక్కన పడేసి.. మెహెర్ రమేష్ తో తమిళ వేదాళం రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా చిరు మరో రీమేక్ కి పచ్చ జెండా ఊపబోతున్నాడనే న్యూస్ మొదలైంది. అది కూడా తమిళంలో అజిత్ నటించిన సినిమానే కావడం గమనార్హం. ఎందుకంటే అజిత్ నటించిన వేదాళం రీమేక్ చెయ్యబోతున్న చిరు మళ్ళీ అజిత్ మూవీనే రీమేక్ చెయ్యడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ఎన్నై అరిందాల్ (ఎంతవాడు కానీ తెలుగు డబ్బేడ్) సినిమాని చిరు రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడట. ఎన్నై అరిందాల్ మీద చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

మరి అజిత్ - త్రిష కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. అలాగే మా టివిలో లెక్కలేనన్నిసార్లు ప్రసారమైన ఈ సినిమాపై చిరుకి అంత ఇంట్రెస్ట్ ఏమిటో.

Chiranjeevi likes only remake subjects:

Chiranjeevi eye on remakes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs