Advertisement
Google Ads BL

ఈవారం బిగ్ బాస్ కి బై బై చెప్పబోతుంది ఎవరంటే?


బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించినా హౌస్ లోని కంటెస్టెంట్స్ మీద ఓ అభిప్రాయాన్ని ఎర్పచుకుని నాగ్ అడగగానే బయట పడిపోతున్నారు. పైకి నవ్వుతున్నారు.. కానీ లోపల మాత్రం ఎదుటి వారి మీద చాలానే పెట్టుకుంటున్నారు. ఇక హౌస్ లో లవ్ స్టోరీస్, గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ.. నాగార్జున శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కి మాత్రం బాగా గిరాకీ ఉంది. నాగార్జున హౌస్ లోని సభ్యులను మందలిస్తూ ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ ఆడిస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. తాజాగా శనివారం కూడా సభ్యులను సున్నితంగా మందలిస్తూనే.. వారి మనసులో మాటను బయట పెట్టించాడు. అమ్మ రాజశేకేర్ ని ఆఫ్ గుండు చేసుకునేలా చేసిన నాగ్ ఒక్కొక్కరి మీద కంటెస్టెంట్స్ మనసులో ఉన్న అభిప్రయాలను బయటపెట్టించాడు. అభిజిత్ అయితే మోనాల్, అఖిల్, అమ్మ రాజశేఖర్ ల మీద నెగెటివిటి బయట పెట్టగా మోనాల్ మాత్రం దివి మీద ఏసుకుంది.

Advertisement
CJ Advs

ఈ వారం తొమ్మిదిమంది సభ్యులు నామినేషన్స్ లో ఉండగా లాస్య, నోయెల్, హారిక లు శనివారం ఎపిసోడ్ లో సేవ్ అవగా.. కుమార్ సాయి, అభిజిత్, అఖిల్, మోనాల్, దివి, అమ్మ రాజశేఖర్ లు ఇంకా నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ వారం బయటికి వెళ్లబోతుంది కుమార్ సాయి అనే లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో కుమార్ సాయి బయటికి వచ్చేస్తాడని.. అతనికి అందరికన్నా తక్కువగా ఓట్స్ పోలయ్యాయని.. అభిజిత్ ఓట్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని అంటున్నారు. అందరూ మోనాల్ కానీ హారిక కానీ బయటికొచ్చేస్తారనుకుంటే ఇక్కడ కుమార్ సాయి బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

కుమార్ సాయి హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి బద్దకంగా ఉండడం, గేమ్స్ లో హుషారుగా ఉండకపోవడం, పెద్దగా గొడవలు పడకపోవడం, లవ్ స్టోరీస్ నడపకపోవడంతో ప్రేక్షకులు కుమార్ ని బయటికి పంపిస్తున్నారని అంటున్నారు. అయితే ఎప్పుడూ ఏడుస్తుండే మోనాల్ గజ్జర్ ని బిగ్ బాస్ కాపాడుతున్నాడని, మెహబూబ్ ని కూడా బిగ్ బాస్ కాపాడుతున్నాడని.. లేదంటే ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యేవాడని, కానీ.. బిగ్ బాస్ మెహబూబ్ ని కాపాడడం కోసం సోహైల్ కి ప్రత్యేక అధికారాలను ఇచ్చింది అంటూ...  ఓట్స్ కి సంబంధం లేకుండానే ఈ గేమ్ ని బిగ్ బాస్ ఆడుతున్నాడంటూ ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై కాస్త వ్యతిరేఖత కూడా స్టార్ట్ అయ్యింది. 

who will eliminate from bigg boss this week?:

Kumar Sai To Get Eliminated From Bigg Boss 4
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs