Advertisement
Google Ads BL

భీమ్‌ కోసం రామరాజు.. క్రేజ్‌ మాములుగా లేదు!


RRR షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. కారణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రాజమౌళి మాటిచ్చాడు. RRR షూటింగ్ మొదలైన ఓ వారంలోనే ఎన్టీఆర్ కొమ్మరం భీం టీజర్ విడుదల చేసి సంతోష పెడతామని.. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీం వీడియో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి మరో నాలుగైదు రోజుల్లో విడుదల కాబోయే RRR భీం వీడియోపై సోషల్ మీడియాలో పిచ్చ క్రేజుంది. ఇది మొత్తం ఎన్టీఆర్ భీం వీడియో వైరల్ అయ్యేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వీడియోని అన్ని భాషల్లోని ప్రేక్షకులు అదరగొట్టేసేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లాన్స్ ఉన్నాయి.

Advertisement
CJ Advs

అయితే రాజమౌళి ఎన్టీఆర్ భీం పాత్రకి సంబందించిన వీడియో కటింగ్ ఎలా చేశాడో? ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడా? ఎన్టీఆర్ భీం పాత్ర ఎలా ఉంటుందో? అనే క్యూరియాసిటిలో ఎన్టీఆర్ ప్లాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియా ప్రేక్షకులు ఉన్నారు. అయితే రాజమౌళి కొమరం భీం పాత్రకి సంబందించిన వీడియోని.. ఓ మాములు వ్యక్తి ప్రజల కోసం ఉద్యమకారుడిగా ఎలా మారాడో... రామ్ చరణ్ అల్లూరి పాత్ర వాయిస్ ద్వారా చెప్పించబోతున్నాడట. అంతేకాకుండా కొమరం భీం గెటప్ లో తలపాగా ముఖ్యమని, ఇంకా ఓ లాల్చీ పైజామాలో ఎన్టీఆర్ కనిపిస్తాడని... ఇప్పటికే RRR షూటింగ్ మొదలైన వీడియోలో ఎన్టీఆర్ లుక్ కొద్ది కొద్దిగా రివీల్ చేసినదాన్ని బట్టి ఎన్టీఆర్ గెటప్ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ గెటప్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలొచ్చేలా ఉంటాయంటున్నారు.

Movie lovers waiting for Jr NTR Video from RRR:

5 days to go for Ramraju for Bheem Video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs