Advertisement
Google Ads BL

ప్రభాస్‌కు మహేష్‌ ఫ్లాప్‌ మూవీ హీరోయిన్‌!


ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏమిటో అతను చేస్తున్న సినిమాలే చెప్పేస్తున్నాయి. బాహుబలి తర్వాత ఒక్క సౌత్ సినిమా కూడా చెయ్యకుండా అన్నీ పాన్ ఇండియా మూవీస్ చెయ్యడం చూస్తే ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్‌లానే ఫీలవుతారు. బాలీవుడ్ హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ మూవీ, ఓంరౌత్ అది పురుష్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ సరసన టాప్ హీరోయిన్స్ క్రేజీ హీరోయిన్స్ మాత్రమే నటిస్తున్నారు. రాధేశ్యామ్‌తో పూజాహెగ్డేతో సరిపెట్టినా నాగ్ అశ్విన్ సినిమాలో దీపికాతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు ప్రభాస్.

Advertisement
CJ Advs

ఇక ఆదిపురుష్ హీరోయిన్ విషయమై రకరకాల న్యూస్‌లు ప్రచారంలోకొచ్చాయి. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడైతే సీతగా కీర్తి సురేష్, అలాగే కియారా అద్వానీల పేర్లు మార్మోగిపోయాయి. కానీ వారిలో ఎవరిని ఆదిపురుష్ హీరోయిన్‌గా ఫైనల్ చేయలేదని టీం చెప్పింది. త్వరలోనే ఆదిపురుష్ హీరోయిన్ పేరు ప్రకటిస్తారని అంటున్నారు. అయితే ఈలోపు బాలీవుడ్‌లో పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్ పేరు ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ప్రచారంలోకొచ్చింది. పెద్ద సినిమాల్లో ఆఫర్స్ లేకపోయినా.. బాలీవుడ్ ఫంక్షన్స్‌లో హాట్ హాట్ గా హడావిడి చేస్తూ తెలుగులో మహేష్ తో వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ ఆదిపురుష్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. 

కానీ క్రేజ్‌లేని ఆ భామ ఆదిపురుష్ హీరోయిన్ కాదు.. మరో క్రేజీ హీరోయిన్‌ని ఓంరౌత్ ఖచ్చితంగా ప్రభాస్ పక్కన సెట్ చేస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు.

Mahesh babu flop movie Heroine for Prabhas :

Kriti sanon for Prabhas Aadipurush
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs