Advertisement
Google Ads BL

ఇది ప్రభాస్‌.. ఆదిపురుష్‌ మూవీ రేంజ్‌!


ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లని ప్రభాస్ ఆదిపురుష్ పై సోషల్ మీడియాలో తెగ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రభాస్‌తో ఓంరౌత్ ఆదిపురుష్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ చేసిన దగ్గర నుండి సినిమాపై క్రేజ్ పెరిగిపోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో తలపడే విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడని అధికారిక ప్రకటన ఇచ్చాడు. ఇక హీరోయిన్ రాక కూడా అతి త్వరలోనే చెప్పబోతున్నారట. ఓంరౌత్ ఆదిపురుష్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఇక ప్రభాస్ కూడా ఆదిపురుష్ కోసం మేకోవర్ లో ఉన్నాడనే న్యూస్ ఉంది. అలాగే హిందీపై పట్టు సాధించడానికి  హిందీ ట్యూషన్ పెట్టించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీ ఫ్లైట్ ఎక్కాడు.

Advertisement
CJ Advs

అయితే ఓంరౌత్ - టి సీరీస్ వాళ్ళు ప్రభాస్ ఆదిపురుష్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట. అది అలాంటి ఇలాంటి బడ్జెట్ కాదు.. 400 కోట్ల భారీ బడ్జెట్ ఆదిపురుష్ కోసం టి సీరీస్ నిర్మాతలు పెట్టబోతున్నారట. 400 కోట్లతో ఆదిపురుష్ మహాకావ్యాన్ని ఓంరౌత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నాడనగానే సినిమాపై పిచ్చగా అంచనాలు పెరిగిపోయాయి. అందులోను ఓ తెలుగు స్టార్ హీరో మీద 400 కోట్లు పెడుతున్న టి సీరీస్ నిర్మాతలపై సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. ఆదిపురుష్ బడ్జెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

అంత భారీ బడ్జెట్ మూవీ గనుకనే ప్రభాస్ అండ్ ఓంరౌత్‌లు సినిమాకి భారీ హైప్ తీసుకురావాలనే ప్లాన్ లో భాగంగా సినిమా అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో వదులుతున్నారనే ప్రచారం ఉంది.

This is the range of Prabhas Aadipurush:

Huge budget to Prabhas Aadipurush movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs