Advertisement
Google Ads BL

సమంత అందుకే భయపడిందా..?


అనుష్క బాహుబలి, భాగమతి తర్వాత చాలా రోజులకి నిశ్శబ్దం సినిమా చేసింది. ఆ సినిమా మహిమ ఏమో కానీ... ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా కాస్తా ఈ మధ్యనే ఓటిటిలో విడుదలైంది. అయితే ఈ సినిమాలో అనుష్క మ్యూట్ కేరెక్టర్ చేసింది. వినబడని, మాట్లాడలేని కేరెక్టర్ కోసం అనుష్క చాలానే కష్టపడింది. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. అయితే అనుష్క హావభావాలు, ఆమె ఇచ్చిన పెరఫార్మెన్స్ అన్ని సూపర్ కానీ సినిమాకే అసలు క్రేజ్ లేకుండాపోయింది. దానితో నిశ్శబ్దం ప్లాప్ లిస్ట్ లోకి పోయింది. అయితే ఇప్పుడు మ్యూట్ కేరెక్టర్ చేసిన అనుష్క ని చూసి అక్కినేని సమంత భయపడుతుందట. పెళ్లి తర్వాత నటనకు స్కోప్ ఉన్న కేరెక్టర్స్ చేస్తున్న సమంత కూడా అనుష్క మాదిరి ఓ మ్యూట్ కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుంది.

Advertisement
CJ Advs

గేమ్‍ ఓవర్‍ దర్శకుడు అశ్విన్ దర్శకత్వంలో సమంత మ్యూట్ కేరెక్టర్ బైలింగ్వల్‍ మూవీకి ఓకే చెప్పింది. ఆ కేరెక్టర్ కోసం సమంత ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు సమంత అశ్విన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అనే టాక్ మాత్రం షాకిస్తుంది. కారణాలు పర్ఫెక్ట్ గా తెలియకపోయినా.. సమంత మనసులో మాత్రం అనుష్క లాంటి హీరోయిన్ ఈ మ్యూట్ కేరెక్టర్ చేసి హిట్ కొట్టలేకపోయింది. అలాగే తాను ఒప్పుకున్న కథ నిశ్శబ్దం కథకు దగ్గరగా ఉంది.. మరి ఈ సినిమా చేసిన ఫలితం నిశ్శబ్దం లానే ఉంటుందేమో అని భయపడి ఈ సినిమానుండి డ్రాప్ అయ్యిందా... అనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. ఇక సమంత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో.. సమంత ప్లేస్ కి తాప్సిని దర్శకనిర్మాతలు సంప్రదించారనే న్యూస్ నడుస్తుంది.

Samantha says no to game over director film :

Fear in Samantha with Anushka nishabdham Role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs