Advertisement
Google Ads BL

రౌడీ హీరో తమ్ముడు కొట్టాడుగా సిక్సర్..!!


టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోను విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. టాలీవుడ్‌లో తనదైన మ్యానరిజంతో స్టార్ హీరోస్ పక్కన చేరిన విజయ్ దేవరకొండ తన ప్రత్యేకమైన స్టయిల్‌తో బాలీవుడ్ సెలబ్రిటీస్‌కి నచ్చే హీరోగా మారాడు. బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ స్టయిల్‌కి పడిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ క్రేజ్‌ని చూసి వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్‌ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌వారు కొన్నారేమో అనిపించక మానదు. కారణం విజయ్ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివానితో కలిసి దొరసాని సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా అటు ఇటుగా ఆడింది కానీ.. హిట్ అయితే అవ్వలేదు.

Advertisement
CJ Advs

ఇక ఆనంద్ దేవరకొండ సెకండ్ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ షూటింగ్ పూర్తయ్యి.. థియేటర్స్ ప్రాబ్లమ్స్‌తో ఓటీటీకి చేరింది. అన్ని సినిమాల వలే మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో విడుదలయితే ఓకే. కానీ ఇక్కడ ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్‌ని అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి కొనుగోలు చేసింది అనే టాక్ కాస్తా సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే మీడియం రేంజ్ సినిమానే ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా. అయితే లో బడ్జెట్ మూవీ గనక అమెజాన్ కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసింది అనుకుంటే పొరబాటే. ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్‌ని ఏకంగా 4.5 కోట్లకి అమెజాన్ ప్రైమ్ వారు కొనేశారట.

ఆ లో బడ్జెట్ సినిమాకి ఈ రేంజ్ ఆఫర్ రావడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. మరి ఆనంద్ అన్న విజయ్ క్రేజ్ చూసి అమెజాన్ అంత పెట్టింది అనుకుంటే పొరబాటే. ఎందుకంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసిన అమెజాన్ సంస్థ వారు ఆ సినిమాకి ఆ రేంజ్ రేటు పెట్టారట. అంటే సినిమా బావుంది అని అనుకున్నాకే ఆ రేటు పెట్టి సినిమాని దక్కించుకున్నారు. మరి అమెజాన్ ప్రైమ్ లో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఈ నెల 20 న విడుదల కాబోతుంది. 

Middle Class Melodies.. Amazing Business:

Vijay Deverakonda Brother Anand Movie Middle Class Melodies sold out 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs