Advertisement
Google Ads BL

మరో దర్శకుడ్ని మహేష్ టెన్షన్ పెడుతున్నాడా?


మహేష్ బాబుకి కథ నచ్చలేదు అంటే మహా మహా దర్శకులని పక్కనబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో పూరి జగన్నాధ్, అలాగే సుకుమార్, మొన్నామధ్యన వంశి పైడిపల్లి.. ఇది మీడియాకి తెలిసిన లెక్క. కానీ ఎవరికీ తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే తాజాగా మహేష్ ఎక్కడ చేజారిపోతాడో అనే టెన్షన్‌లో దర్శకుడు ఒకరు కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడట. అతనే పరశురామ్.  గీత గోవిందం తర్వాత మహేష్ ని నమ్ముకుంటే వర్కౌట్ అవ్వక నాగ చైతన్యకి కనెక్ట్ అయ్యి సినిమా ప్రకటించాక మళ్ళీ మహేష్ పిలిచి సర్కారు వారి పాట అవకాశం ఇచ్చాడు. సర్కారు వారి పాట టైటిల్ నటుల ఎంపిక కూడా అయ్యింది. కానీ కరోనా షూటింగ్ కి సహకరించడం లేదు.

Advertisement
CJ Advs

రేపో మాపో అమెరికాలో సర్కారు వారి పాట షెడ్యూల్ మొదలవుతుంది అనుకుంటే... అక్కడ లొకేషన్స్ వెతుకులాటలో ఉన్న పరశురామ్ కి ప్రస్తుతం అక్కడ షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా పడిందనే టాక్ ఉంది. అయితే మధ్యలో మహేష్ త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుంది అని ప్రకటించడంతో.. పరశురామ్ గనక లొకేషన్స్ విషయం తెగకుండా షూటింగ్ లేట్ చేస్తే మహేష్ ఎక్కడ త్రివిక్రమ్ కి కమిట్ అవుతాడో అని టెన్షన్ పడుతున్నాడట. 

ఎందుకంటే త్రివిక్రమ్ తో చెయ్యాల్సిన ఎన్టీఆర్ ప్రస్తుతం RRR షూటింగ్ లో బిజీ. అప్పుడు త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు మొదలెడతాడో తెలియదు. ఈలోపు మహేష్ కదిపితే త్రివిక్రమ్ మహేష్ ఓకే చెప్పినా చెప్పొచ్చని ఊహాగానాల మధ్యన పరశురామ్, మహేష్ విషయంలో నలిగిపోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Mahesh Babu Pressure on director Parasuram:

Trivikram waiting for Mahesh.. Parasuram in Tension
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs