Advertisement
Google Ads BL

బిగ్‌బాస్: గంగవ్వ స్థానంలో వచ్చేదెవరు?


గత శనివారం ఎప్పటిలాగే హౌస్ మేట్స్‌కి నాగార్జున సీరియస్ క్లాస్‌తో కొరడా ఝుళిపించాడు. అభిజిత్‌కి, అఖిల్‌కి కలిపి మోనాల్ విషయంలో వార్నింగ్ ఇచ్చేశాడు. ఇక సోహైల్‌కి పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావ్ అంటూ గడ్డి పెట్టాడు. అలాగే మెహబూబ్‌కి పుచ్చ పగిలిపోతుంది అంటావా అంటూ తలంటాడు. అమ్మ రాజ శేఖర్‌కి కూడా ఫుల్ క్లాస్ ఇచ్చేసిన నాగార్జున పెద్దావిడ గంగవ్వ అభ్యర్ధన మేరకు బిగ్ బాస్‌తో మాట్లాడి ఆవిడని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయడమే కాదు.... నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యంతో మాట్లాడి ఇల్లు కట్టిస్తా అంటూ గంగవ్వకి మాటిచ్చేసి బిగ్ బాస్‌లో ఓ మంచికి శ్రీకారం చుట్టేశాడు. అక్కడ శనివారం సోహైల్‌ని ఎలిమిలోనేషన్ నుండి సేవ్ చేసిన నాగ్... గంగవ్వ కూడా అఖిల్‌ని సేవ్ చేసి ఇంటికి పోయింది.

Advertisement
CJ Advs

ఇక కథ అక్కడితో అవ్వలేదు. సన్ డే ఫన్ డేలో ఏడుగురులో సుజాత ఎలిమినేట్ అయ్యింది. ఈ సన్ డే ఫన్ అంతగా అనిపించలేదు బిగ్ బాస్‌లో. ఇక ఇప్పుడు హౌస్‌లో 13 మంది సభ్యులు. పది వారాల ఆట మిగిలి ఉంది. ఇప్పటివరకు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ద్వారా ముగ్గురు బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టగా మాస్ అవినాష్ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇక స్వాతి దీక్షిత్ మాత్రం ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. కుమార్ సాయి ఏదో అలా అలా నడిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు గంగవ్వ ప్లేస్ లోకి బిగ్ బాస్ లోకి దింపే కంటెస్టెంట్ పై అందరిలో చర్చ మొదలయ్యింది.

గంగవ్వ ప్లేస్ లోకి వచ్చే కంటెస్టెంట్ అప్పుడే బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉన్నారని... త్వరలోనే వాళ్ళు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని  అంటున్నారు. మరి స్వాతినే మళ్ళీ తీసుకొస్తారో.. లేదంటే కొత్త కంటెస్టెంట్ ని ఎవరినైనా దింపుతుందో బిగ్ బాస్ అనేది చూడాలి.

Bigg Boss: Who filled Gangavva Place?:

Gangavva out from Bigg Boss House
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs