Advertisement
Google Ads BL

రాజమౌళి ప్రపోజల్‌ని కాదన్న ఎన్టీఆర్, చరణ్!


అదేంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మాట వినని హీరోలు కూడా ఉంటారా? అంటే ఉండరు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఉన్నారట. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా విషయంలో రాజమౌళి పెట్టిన ప్రపోజల్‌కి ఈ ఇద్దరు హీరోలు నో చెప్పారని టాక్ నడుస్తుంది. మామూలుగా అయితే హీరోలు చెప్పిందే చాలామంది డైరెక్టర్స్ ఫాలో అవుతారు. కానీ రాజమౌళి చెప్పింది హీరోలు చెయ్యాల్సిందే. ఇష్టంగా చేస్తారు కూడా. అలాంటిది ఎన్టీఆర్, రామ్ చరణ్ కాదన్నారంటే.. ఆలోచించాల్సిందే. అది ఏదో కాదు... బాహుబలిని ఐదేళ్లు చెక్కి చెక్కి రెండు భాగాలుగా విడుదల చేసే సమయానికి ప్రభాస్ కెరీర్ లో పుణ్యకాలం అంతా గడిచిపోయింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా RRR కూడా కరోనాతో షూటింగ్ బాగా లేట్ అయ్యింది. అందులోను వచ్చే సమ్మర్‌కి సినిమా విడుదల అన్నారంటే చాలా కష్టము. అందులో RRR సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంతవరకు జరగలేదట. అవన్నీ ఇప్పుడు మొదలు పెట్టి చేసినా 2021 లో సినిమా విడుదలకు కష్టమంటున్నారు. అంటే 2022 లో RRR విడుదల అయ్యేలా కనిపిస్తుంది. 

కాబట్టే రాజమౌళి RRR ని రెండు భాగాలుగా చీల్చి 2021 లో ఒకటి, 22 లో మరొకటి విడుదల చేద్దామని ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల దగ్గర ప్రపోజల్ పెట్టగానే.. వెంటనే ప్రభాస్ గుర్తొచ్చి అమ్మో వద్దు జక్కన్నా కొద్దిగా లేట్ అయినా RRR ఒకేసారి విడుదల చెయ్యమని చెప్పారట. అదండీ విషయం. రాజమౌళికి ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు అందుకే నో చెప్పింది.

Jr NTR And Charan says no to Rajamouli Proposal :

First Rajamouli Plan on RRR movie revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs