Advertisement
Google Ads BL

రాజ్ తరుణ్‌.. కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?


రాజ్ తరుణ్ డైరెక్టర్ కాబోయి హీరో అయ్యాడు. ఉయ్యాల జంపాలతో హీరోగా మారిన రాజ్ తరుణ్ అసలు ఇండస్ట్రీలోకి వచ్చింది డైరెక్టర్ అవుదామని. కానీ ఉయ్యాల జంపాల ఆడిషన్స్ అప్పుడు రాజ్ తరుణ్ అనుకోకుండా హీరో అయ్యాడు. వరసగా మూడు హిట్స్ పడేసరికి రాజ్ తరుణ్ హీరోగానే సెటిల్ అయ్యాడు. కానీ ఈ మధ్యన వరసగా నాలుగు సినిమాల ప్లాప్ తో రాజ్ తరుణ్ కెరీర్ డోలాయమానంలో పడింది. హీరోగా రాజ్ తరుణ్ కెరీర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టాలెంట్ ఉన్నా మూస కథలు, రొటీన్ కథలతోనే రాజ్ తరుణ్ ప్లాప్స్ బారిన పడుతున్నాడు. కొత్తగా ఆలోచించలేకపోతున్నాడా? లేదంటే ప్రేక్షకులు దేనిని అయినా ఆదరిస్తారని ధీమానో కానీ రాజ్ తరుణ్ మాత్రం ప్రస్తుతం ఆలోచనలో పడ్డట్టుగా ఉన్నాడు.

Advertisement
CJ Advs

ఆలోచన అంటే ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తాను డైరెక్టర్ కాబోయి హీరో అయ్యా అని కానీ ఎప్పటికైనా డైరెక్టర్ అవతారమెత్తుతా అంటున్నాడు. అయితే ఇప్పటికే తాను ఇద్దరు హీరోలని దృష్టిలో ఉంచుకుని కథలు రాసుకున్నా అని... అది ఒకటి అల్లు అర్జున్ ని మదిలో పెట్టుకుని ఆయనకు సరిపోయే కథ రాసుకున్నా అంటున్నాడు. తర్వాత సునీల్ హీరోగా ఓ సినిమా కథ తయారు చేశా అంటున్నాడు. కథ రాసుకునేటప్పుడే హీరోలను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తామని చెబుతున్నాడు రాజ్ తరుణ్. అయితే బన్నీతో సినిమా చేస్తానో లేదో అనే నిరాశతో మాట్లాడుతున్నాడు. మరి సునీల్‌కి అనుకున్న కథకి నిర్మాత దొరికితే రాజ్ తరుణ్ డైరెక్టర్ అవతారమెత్తినా ఎత్తొచ్చు. కానీ బన్నీ, రాజ్ తరుణ్‌కి దొరకాలంటే కాస్త కష్టమే. మరి బన్నీతో రాజ్ తరుణ్ సినిమా చెయ్యాలనే కల నెరవేరుతుందో లేదంటే రాజ్ తరుణ్ చెప్పినట్టుగా చేయలేడో చూడాలి.

Raj Tarun openly expressed his wish:

Young hero Raj Tarun wish to direct Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs