Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, మహేష్.. కన్ఫ్యూజ్‌లో త్రివిక్రమ్ !


మహేష్ బాబు అతి త్వరలోనే పరశురామ్‌తో సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మరో సినిమాని ఓకే చెప్పడానికి ఓ ఆరు నెలలు పట్టింది. కానీ సర్కారు వారి పాట సినిమా ఓకే అయ్యాక మహేష్, రాజమౌళితో సినిమా అంటూ రాజమౌళి చెప్పేశాడు. సర్కారు వారి పాట అవ్వగానే రాజమౌళితో సినిమాని మహేష్ మొదలుపెడతాడని అన్నారు. అయితే రాజమౌళి తర్వాత మహేష్ బాబు పక్కా ప్లానింగ్‌తో త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుంది అంటూ అనౌన్స్ చేసేశాడు. అయితే ఇక్కడ ఈ అనౌన్సమెంట్‌తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కానీ త్రివిక్రమే కాస్త కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా టాక్.

Advertisement
CJ Advs

అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో సినిమాని కమిట్ చేయించుకున్నాడు. ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలు కావాల్సిన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోకి కరోనా అడ్డం పడింది. ఎన్టీఆర్ ఇంకా RRR షూటింగ్‌లోనే ఉన్నాడు. లేదంటే పర్ఫెక్ట్‌గా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా మొదలయితే సంక్రాంతికి సినిమాని విడుదల చేసేసేవాడే త్రివిక్రమ్. అయితే ఎన్టీఆర్ RRR అవ్వాలి.. అప్పుడు తన సినిమా మొదలెట్టాలి. దీనికి చాలా టైం పట్టేట్టు ఉంటే.. ఇప్పుడు మహేష్‌తో సినిమా ప్రకటనతో త్రివిక్రమ్, మహేష్‌కి కథ సిద్ధం చెయ్యాలా... లేదంటే ఎన్టీఆర్ కోసం అలానే వెయిట్ చెయ్యాలా.. ఎలాగూ మహేష్‌కి సర్కారు వారి పాట అవ్వాలి.. తర్వాత రాజమౌళితో సినిమా అవ్వాలి. అందుకే మరో కథతో మరో హీరోని వెతుక్కోవాలా.. అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నాడని అంటున్నారు.

Trivikram Srinvias in Confusion:

Jr NTR and Mahesh Babu.. who is Trivikram Srinivas next Hero?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs