Advertisement
Google Ads BL

ఆ సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ గరం గరం!


ప్రభాస్ బాహుబలి నుండి బద్దకంగా సినిమాలు చేస్తున్నాడని చాలామంది అభిమానులు ఫీలవుతున్నారు. బాహుబలికి ఐదేళ్లు, సాహోకి రెండున్నరేళ్లు. ఇక రాధేశ్యామ్ అప్పుడే ఏడాదిన్నర. ఇక రాధేశ్యామ్ విషయాలు, ముచ్చట్లు పక్కనబెట్టి నాగ్ అశ్విన్, ఆదిపురుష్ మీదే ప్రభాస్ ఫోకస్ పెట్టాడని ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్న న్యూస్. ఎందుకంటే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ వదలడానికి యూవీ క్రియేషన్స్ వారు ఎంత నాన్చారో చూసాం. ఇప్పుడు తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రాధేశ్యామ్‌కి సంబంధించిన అప్ డేట్ లేదని మూవీ టీం చేతులెత్తేసింది. కరోనా కారణంగా ఆగిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఇక బర్త్ డేకి ఏం అప్ డేట్ ఇస్తామంటున్నారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్రున లేచింది.

Advertisement
CJ Advs

అది నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాకి ప్రభాస్ పుట్టిన రోజు ముందే కిర్రాక్ అప్ డేట్ అంటూ అనౌన్స్ చేశాడు. ఇక ఆదిపురుష్ కి ఒక్కొక్క సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, విలన్ సైఫ్ ల పేర్లు, సినిమాకి కావాల్సిన అప్ డేట్ ఇస్తుంటే.. ప్రభాస్ పుట్టిన రోజునాడు హీరోయిన్ ప్రకటన ఉంటుంది అంటున్నారు. కానీ రాధేశ్యామ్ షూటింగ్ అంత జరిగి అంత ఫుటేజ్ పెట్టుకుని కనీసం టీజర్ ప్లాన్ కూడా చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇక నిన్నగాక మొన్న RRR షూటింగ్ మొదలవుతుంది అంటూ ఆయా మేకింగ్ వీడియో వదలడమే కాదు... అక్టోబర్ 22 న భీం స్పెషల్ ఎన్టీఆర్ పాత్ర టీజర్ వదలబోతున్నట్టుగా ప్రకటించారు. 

కానీ ప్రభాస్ రాధేశ్యాం మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా లైట్ గా ఉంది. అంటూ ప్రభాస్ ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. సాహో లాగే రాధేశ్యామ్‌ని కూడా ప్లాప్ చేసేలా ఉంది టీం అంటూ రాధేశ్యామ్ నిర్మాతలను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Prabhas Fans fire on Radhe Shyam Movie Producers :

Prabhas fans angry on radhe shyam team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs