Advertisement
Google Ads BL

సరిపోదు శ్రీముఖి.. కొత్తగా ట్రై చెయ్..!


ఈటీవీలో గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న క్రేజీ కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో హాట్ యాంకర్స్‌గా అనసూయ, రష్మీ గౌతమ్‌లో ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించారు. కామెడీతో జబర్దస్త్ స్కిట్స్ ఎలా పేలతాయో అంతే హాట్ గ్లామర్‌తో అనసూయ, రష్మిలు అదరగొడతారు. అనసూయ వేసే డ్రెస్సులు, ఆమె స్టయిల్, అందానికి జబర్దస్త్ ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇక రష్మీకి తెలుగు మాట్లాడడం రాకపోయినా గ్లామర్ తోనే మ్యానేజ్ చేస్తుంది. అయితే జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్స్ కి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఏ యాంకర్స్‌కి లేని డిమాండ్ ఈ హాట్ యాంకర్స్ కి ఉంది.

Advertisement
CJ Advs

ఇక పటాస్‌తోనూ, డ్రామా జూనియర్స్‌తో యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన శ్రీముఖి గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 లోను పాపులారిటీ సంపాదించింది. ఇక ఈ ఏడాది ఓహ్ ఉమానియా అనే షో తో యూట్యూబ్ ఛానల్ లో హడావిడి చేసిన శ్రీముఖి.. ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న బొమ్మ అదిరింది కామెడీ షోకి యాంకర్ గా మారింది. ఈ షోలో శ్రీముఖి హాట్‌గా కన్నా మాటలతోనే ఎక్కుగా హడావిడి చేస్తుంది. 

బొమ్మ అదిరింది మరో లెవల్ కామెడీ అంటూ నాగబాబు, సుమ, జానీ మాస్టర్‌లు గెస్ట్‌లుగా శ్రీముఖి యాంకరింగ్ లో మొదలైన ఈ షో గత ఆదివారం పర్వాలేదనిపింది. అయితే శ్రీముఖి తన యాంకరింగ్ తో అనసూయ, రష్మీలకి చెక్ పెట్టగలదా అనేది కాస్త డౌట్. ఎందుకంటే అనసూయ, రష్మీ పాపులారిటీ కొట్టేయాలంటే శ్రీముఖి ఇంకా కొత్తగా ఏదో ట్రై చెయ్యాలి అంటున్నారు. 

Anasuya, Rashmi vs Sree mukhi:

Sree Mukhi anchor for Bomma Adirindhi 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs