Advertisement

హీరోలింకా.. కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారా?


అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ ఓపెన్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. 50 శాతం ప్రేక్షకులతో కాదు.... 100 శాతం ప్రేక్షకులతోనే థియేటర్స్ ఓపెన్ కావాలంటూ రాజమౌళి లాంటి దర్శకుడే చెబుతున్నాడు. ప్రస్తుతం 50 శాతం ప్రేక్షకులతో థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కి ధైర్యంగా వస్తారా లేదా అనేది తెలియాలంటే థియేటర్స్‌లో క్రేజ్ ఉన్న బొమ్మ పడాలి. అప్పుడుగాని ప్రేక్షకుల మీద హీరోలు ఓ అంచనాకు రారు. కాదు ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్స్‌కి రారనుకుని సినిమాలు విడుదల చేయకుండా ఆగితే.. ఎవరికి నష్టం. మరి థియేటర్స్ ఓపెన్ అంటున్నా హీరోలెవరూ సినిమాల డేట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

Advertisement

దసరాకి మంచి సీజన్ సినిమాలు రిలీజ్ అవుతాయని.. అనుకుంటే.. హీరోలు ధైర్యం చెయ్యడం లేదు. అంటే ఈ దసరా సీజన్ వెళితే కానీ.. హీరోలు కదిలేలా లేరు. అంటే దీవాళికి అయినా హీరోలు ధైర్యం చేస్తారా? లేదంటే సంక్రాంతికే సినిమాలు విడుదల అని స్టిక్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. థియేటర్స్ ఓపెన్ అవుతుంటే ఓటిటీలు బెంబేలెత్తుతున్నాయి. తమకి సినిమాలు అమ్మరని అని ఫిక్స్ అవుతున్నారు. ఇక హీరోలు కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కదా అని పొలోమంటూ సినిమాల విడుదల తేదీలు ప్రకటించెయ్యకుండా దర్శకనిర్మాతలతో చూద్దాం ఆగమంటున్నారు.

లేదంటే రామ్ రెడ్, వైష్ణవ తేజ్ ఉప్పెన, సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటరు, నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాల డేట్స్ రావడం ఏమిటి ప్రమోషన్స్ కూడా హీరోలు మొదలు పెట్టేవారు. కానీ చూద్దాం ఆగండి అన్నారంటే... థియేటర్స్ ఓపెన్ అయ్యాక పరిస్థితులని బట్టి హీరోలు ముందుకు అడుగేస్తారన్నమాట. 

Still Tollywood heroes in Confusion?:

Permission to Theaters Opening.. but no movement in heroes 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement