మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన రియాచక్రవర్తి కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన మాదక ద్రవ్యాల కేసులో రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9వ తేదీన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. మాదక ద్రవ్యాల సరఫరాలో తమ ప్రమేయం ఉందన్న కారణంగా రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి కూడా అరెస్ట్ అయ్యాడు.
ఐతే బాంబే హైకోర్టు షోవిక్ చక్రవర్తికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అనేక పరిమితుల మధ్య రియాచక్రవర్తికి బెయిల్ మంజూరు అయ్యింది. కేసు నడుస్తున్నన్ని రోజులు అనుమతి లేకుండా రియా చక్రవర్తి ముంబై దాటి వెళ్ళకూడదని తెలిపింది. జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన తండ్రి పోలీసులని ఆశ్రయించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసాడు.