మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమా ఎంత బాగా హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. క్లాస్, మాస్ అంశాలన్నీ కలగలిపి మహేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంలా నిలిచింది. మణిశర్మ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఐతే అతడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అతిధి సినిమా తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మరీ చేసిన ఖలేజా ప్రేక్షకులకి అంతగా రుచించలేదు.
ఐతే థియేటర్లలో అంతగా మెప్పించిన ఖలేజా చిత్రం బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటవిశ్వరూపం చూడొచ్చు. అంతకుముందెన్నడూ ప్రేక్షకులు చూడని మహేష్ బాబు ఖలేజా సినిమాలో కనిపించాడు. థియేటర్లలో అంతగా ఆడకపోయినా ఈ సినిమాకి అభిమానులు చాలా మందే ఉన్నారు.
ప్రస్తుతం ఖలేజా సినిమా రిలీజై నేటికి పది సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, ఖలేజా చిత్రంపై ట్వీట్ వేసాడు. నటుడిగా తనని మార్చిన సినిమా అని చెప్తూ, తన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకొచ్చాడు. ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ కి థ్యాంక్స్ తెలిపాడు. అంతే కాదు వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తుందంటూ అతికొద్ది రోజుల్లోనే తెరమీదకి వెళ్లనుందని పోస్ట్ పెట్టాడు.