రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ఆరునెలల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అనుకోకుండా వచ్చిన ఉపద్రవం కారణంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ నిలిచిపోయింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూసారు. ఐతే ఆ ఎదురుచూపులన్నీ ఎన్టీఆర్ లుక్ కోసమే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ రివీల్ చేసినప్పటి నుండి ఈ ఎదురుచూపులు మొదలయ్యాయి.
ఆ ఎదురుచూపుల కాలం ఆరునెలలు దాటిపోయింది. మరికొద్ది రోజుల్లో ఆ నిరీక్షణకి తెరపడనుంది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ చిత్రీకరణ మొదలుపెట్టింది. ఈ విషయమై షూటింగ్ మొదలుపెడుతోన్న దృశ్యాలని వీడియో రూపంలో చూపించారు. ఒక్కొక్కదానికి బూజు దులుపుతూ మళ్ళీ సెట్లోకి అడుగుపెట్టారు. వీడియో చివర్లో హీరోలిద్దరినీ మసక మసగ్గా చూపించారు.
ఐతే అక్టోబర్ 22వ తేదీన కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తారట. కొమరం భీమ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. సో.. ఇన్నాళ్ళు ఎదురుచూసిన అభిమానులకి మంచి పండగ లాంటీ ట్రీట్ అక్టోబర్ 22వ తేదీ లభించనుంది. రామరాజు ఫర్ భీమ్ పేరుతో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పరిచయం ఉండనుంది.