Advertisement
Google Ads BL

కాజల్ పెళ్లి ఫిక్స్.. వరుడితనే..!!


కాజల్ అగర్వాల్‌కి పెళ్లంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నప్పటికీ.. కాజల్ ఒప్పుకుంటున్న ప్రాజెక్ట్స్ చూశాక కాజల్ పెళ్లి విషయంలో అవి గాసిప్స్ అనుకున్నారు. కాజల్ అగర్వాల్ కూడా లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉంటుంది అనుకున్నారు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే చిరు ఆచార్య ఒప్పుకున్న కాజల్ అగర్వాల్ చిరుతో నటించేందుకు ఉత్సాహంగా ఉంది. అయితే ఈ లోపు కాజల్ అగర్వాల్‌కి ఓ బిజినెస్ మ్యాన్‌తో నిశ్చితార్ధం జరిగింది అంటూ ప్రచారం జరిగింది. ఓ బిజినెస్ మ్యాన్‌తో కాజల్ నిశ్చితార్ధం.. త్వరలోనే పెళ్లి అని ప్రచారం జరుగుతున్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి వార్తలపై స్పందించలేదు.

Advertisement
CJ Advs

తాజాగా కాజల్ అగర్వాల్ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే కాజల్ అగర్వాల్ ఈ బిజినెస్ మ్యాన్‌నే పెళ్లాడబోతుంది అంటూ సోషల్ మీడియాలో కాజల్‌కి కాబోయే భర్త అంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. అది ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే బడా వ్యాపార వేత్త ఫోటో. మరి కాజల్ పెళ్లాడబోయేది గౌతమ్ కిచ్లునే అంటున్నారు. అదే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కాజల్‌కి కాబోయే భర్త డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియల్ డిజైన్ సంస్థను నడుపుతున్నట్లుగా చెబుతున్నారు. 

కరోనా లాక్ డౌన్ ముగియగానే కాజల్ అగర్వాల్, గౌతమ్‌ల పెళ్లి ముంబైలోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యుల మధ్యన జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై చందమామ కాజల్ స్పందించాల్సి ఉంది.

Kajal Aggarwal is marrying businessman Gautam Kitchlu:

Kajal Aggarwal Is All Set To Tie The Knot With Businessman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs