Advertisement
Google Ads BL

పవన్‌ కళ్యాణ్‌నే ఫాలో అవుతున్న మాస్ రాజా?


పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటుగా మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. మళ్లీ సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపిస్తున్నాడు. నల్లకోటు వేసుకున్న రౌడీ హీరోలా పవన్ వకీల్ సాబ్‌లో కనిపించబోతున్నాడని వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌లోనే చూసాం. అయితే ఇప్పుడు పవన్‌ని మాస్ మహారాజ్ రవితేజ ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. వరస ప్లాప్స్‌తో సతమతమవుతున్న రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. తాజాగా రవితేజ నటించిన క్రాక్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది.

Advertisement
CJ Advs

ఇక రమేష్ వర్మతో ఒక మూవీని రవితేజ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మారుతితో రవితేజ మరో మూవీకి కమిట్ అయ్యాడని.. త్వరలోనే దానిమీద ప్రకటన రాబోతుంది అంటున్నారు. యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థ‌లు మారుతీ - రవితేజ సినిమాని నిర్మిస్తాయని.. అయితే ఈ మూవీ బాలీవుడ్ లో హిట్ అయిన జాలీ ఎల్ ఎల్ బీ టైప్ లో ఉండబోతుంది అనేది లేటెస్ట్ న్యూస్. మారుతీ, రవితేజతో చెయ్యబోయే సినిమాని కామెడీ ఎంటర్టైనర్‌గా రాసుకున్నాడని.. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు.

సినిమా మొత్తం జాలీ ఎల్ ఎల్ బీ టైప్‌లో కామెడీగా ఉంటుంది అంటున్నారు. మరి ఈ సినిమాలో నటించబోయే నటుల ఎంపికని, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మారుతీ బిజీగా ఉన్నాడట. 

Raviteja follows Power Star Pawan Kalyan:

This is the Raviteja and Maruthi film Concept 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs