Advertisement
Google Ads BL

బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తోందా?


బిగ్ బాస్ సీజన్ 4 కి బుల్లితెర ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. బిగ్ బాస్‌కి శని ఆదివారాల్లో ఉన్న క్రేజ్, టీఆర్పీ వీక్ డేస్‌లో రావడం లేదు. హౌస్ మేట్స్ ఎవరికీ వారే సేఫ్ గేమ్ ఆడుతున్నారు తప్ప బిగ్ బాస్ గేమ్‌ని గేమ్ లా చూడడం లేదు. ఏదో హౌస్‌లో అరుపులు పెడబొబ్బలతో హైలెట్ అవ్వొచ్చని మెహబూబ్, సోహైల్ లాంటి వాళ్ళు అనుకుంటుంటే.. అఖిల్, అభిజిత్ లాంటివాళ్లు అమ్మాయిలని ఫ్లట్ చేస్తే చాలు విన్నర్ అవుతామనుకుంటున్నారు. ఇక ఫస్ట్ టు వీక్స్ దూకుడు చూపించిన నోయెల్.. నాగ్ ఇచ్చిన క్లాస్‌తో అసలు స్క్రీన్‌లోనే కనిపించడం లేదు. ఇక అమ్మ రాజశేఖర్, లాస్య, అరియనా, దివి ఎవరికీ వారే యమునా తీరే. మిగిలిన అమ్మాయిలలో మోనాల్ గజ్జర్ ఇద్దరబ్బాయిలతో దొంగాట ఆడుతుంది. డే అఖిల్ తో స్పెండ్ చేస్తే నైట్ అభితో అన్నట్టుగా ఉంది ఆమె వ్యవహారం, ఇక లేదంటే ఏడుపు తప్ప మోనాల్ చేసేదేమిలేదు. అందుకే వరసబెట్టి మూడు వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి పంపింది బిగ్ బాస్ యాజమాన్యం.

Advertisement
CJ Advs

అందులో కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఫెయిల్. కుమార్ సాయి ఎప్పుడూ నిద్ర, గేమ్ ఆడడం రాదు, ఎలా ఉండాలో తెలియదు. ఇక స్వాతి దీక్షిత్ ఆట ఆడడం రాదు. అబ్బాయిలతో టైం స్పెండింగ్. అలాగే గ్లామర్ ఆరబోత తప్ప మరేమి లేదు. అందుకే పాప వన్ వీక్ లోనే ఎలిమినేషన్‌కి వెళ్ళిపోయింది. ఇక మూడో వైల్డ్ కార్డు జబర్దస్త్ అవినాష్. కమెడియన్ కమెడియన్ లాగే బిగ్ బాస్ హౌస్‌ని ఎంటర్టైన్మెంట్‌తో పై పైకి లేపుతున్నాడు. ఎప్పుడూ మంచి కామెడీతో బెస్ట్ కంటెస్టెంట్‌లా కనిపిస్తున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్‌ని చూసిన వారు అయ్యో గ్లామర్ బ్యూటీ బయటికొచ్చేస్తే అరుపుల స్టార్స్ మెహబూబ్, సోహైల్ లు షోలో ఉండడమేమిటి అంటున్నారు.

ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ మాములుగా లేవు అనడానికి బిగ్ బాస్ ప్రోమోస్ సాక్ష్యం. మోనాల్ కోసం అఖిల్, అభిజిత్‌లు ఎలిమినేషన్‌ని ఫేస్ చెయ్యడం.. మోనాల్, మెహబూబ్, అరియనాలు బాగా ఏడవడం చూస్తుంటే ఈవారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో హౌస్ మేట్స్ ఎమోషన్స్ బాగా బయటికొచ్చేట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం నాగ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఊరట నిచ్చింది. ఈ వారంలో నాగ్ హౌస్ మేట్స్ ఆడించిన గేమ్స్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Rumors on Bigg Boss telugu season 4:

Only one best contestant in bigg boss 4 house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs