Advertisement
Google Ads BL

స్వీటీ అనుష్క ఆపేయడం లేదు.. తెలుసా?


స్వీటీ అనుష్క నిశ్శబ్దం సినిమా తర్వాత సినిమాలు ఆపేయబోతోంది అనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది. ఇక నిశ్శబ్దంలో అనుష్క లుక్స్, ఆమె బరువు చూశాక నిశ్శబ్దంతో అనుష్క కెరీర్‌కి ఎండ్ కార్డు పడడం పక్కా అనుకున్నారు. నిశ్శబ్దం సినిమాలో అనుష్క లుక్స్ పరంగాను, బరువు పరంగాను చాల విమర్శలే ఎదుర్కొంది. ఇక సినిమాలో అంజలిని హైలెట్ చేస్తూ అనుష్క స్క్రీన్ స్పేస్ తగ్గింది. ఆ విషయంలో అనుష్క ఏం అనుకుందో తెలియదు కానీ.. వెబ్ మీడియా మాత్రం ఆ సినిమాలో అనుష్క కేరెక్టర్ గురించి ఉతికి ఆరేసింది. అయితే అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా అనే ప్రశ్నకి ఆమె ట్విట్టర్‌లో ఇచ్చిన సమాధానంతో క్లారిటీ వచ్చింది. ఎప్పుడూ అభిమానులతో చాట్ చేయని అనుష్క తాజాగా ట్విట్టర్ చాట్‌లో అభిమానులతో ముచ్చటించింది.

Advertisement
CJ Advs

ఓ అభిమాని అనుష్కని ఉద్దేసించి మీరు భాగమతి, నిశ్శబ్దం సినిమాలు చాలా గ్యాప్‌లు ఇచ్చి చేశారు. మరి తర్వాతి ప్రాజెక్ట్స్‌ని ఎప్పుడు ప్రకటిస్తారు అని అడగగానే దానికి అనుష్క త్వరలోనే చెబుతా అంటుంది. అంటే అనుష్క కథలు వింటూ సినిమాలు ఒప్పుకోవడానికి రెడీగానే ఉందనిపిస్తుంది. ఇక అనుష్క ప్రాజెక్ట్స్‌ని త్వరలోనే ఆయా నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయంటూ అభిమానులకి భరోసా ఇచ్చేసింది అనుష్క. 

ఇక నిశ్శబ్దంలో సాక్షి పాత్ర గురించి మాట్లాడుతూ.. నటిగా నా పరిధి దాటి నటించేలా చేసిన పాత్ర అది.. ఆ పాత్ర చెయ్యడం సవాల్‌తో కూడుకున్న పని. ఆ పాత్రలో ఆల్ మ్యూట్‌గా నటించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా అంటుంది. ఇక లాక్ డౌన్‌లో అనుష్క జీవితాన్ని తెలుసుకున్నానని చెబుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎల్లప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండవు. ప్రతి క్షణానికి, వ్యక్తికీ మనం విలువ నివ్వాలి అంటుంది స్వీట్ అనుష్క.

Anushka Chit Chat Highlights:

Anushka Clarity about her future Projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs