Advertisement
Google Ads BL

ఆ ఫోటోపై అనుష్క స్పందన ఇదే..


బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి, ఆ తర్వాత అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తుంది. సైజ్ జీరో మొదలుకుని భాగమతి, నిశ్శబ్దం చిత్రాలాన్నీలేడీ ఓరియంటెడ్ చిత్రాలే. ఐతే తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం నిశ్శబ్దం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అనుష్క శెట్టి ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ మధ్యే ట్విట్టర్ లో జాయిన అయిన అనుష్క నిశ్శబ్దం సినిమా విషయమై అభిమానులతో మాట్లాడింది.

Advertisement
CJ Advs

ఇందులో భాగంగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక నెటిజన్, ప్రభాస్, అనుష్క పెళ్ళి పీటల మీద కూర్చున్న ఫోటో పెట్టి దీనిపై ఒక కామెంట్ పెట్టండని కోరాడు. పెళ్ళి దుస్తుల్లో అగ్ని ముందు కూర్చుని అచ్చమైన తెలుగు జంటలా ఉన్న ఫోటోపై అనుష్క ఈ విధంగా కామెంట్ చేసింది. మిర్చి సినిమా పోస్టర్ కోసం దిగిన ఫోటో అని చెబుతూ చిత్ర నిర్మాతలైన ప్రమోద్, వంశీ, కృతజ్ఞతలు తెలిపింది.

నిశ్శబ్దం సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపించగా, అంజలి, షాలినీ పాండే, ఆర్ మాధవన్ మరో కీలక పాత్రల్లో కనిపించారు. హేమంత్ మధుకర్ సంగీతం వహించిన ఈ సినిమాని కోన ఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్లో కోన వెంకట్ నిర్మించారు.

click here for Anushkas Tweet

Anushka given clariity about that photo..:

Anushka given clariity about that photo..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs