తమిళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ సేతుపతి.. కేరెక్టర్ నచ్చితే నెగెటివ్ పాత్రకైనా రెడీ అంటాడు. అలాగే కేరెక్టర్ ఆర్టిస్ట్‌గాను విజయ్ సేతుపతి ఇరగదీశాడు. హీరోగా సినిమాలు చేస్తుంటాడు. అవకాశం వచ్చినప్పుడు విలన్‌గాను అదరగొట్టేశాడు. తెలుగులో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ కేరెక్టర్ చేశాడు. అది ఇంకా విడుదల కావాల్సి ఉండగా.. తమిళంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మాస్టర్ చిత్రం కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా విజయ్ సేతుపతి మాస్టర్‌లో తాను నటించిన విలన్ రోల్ గురించి మాట్లాడుతూ.. హీరో విజయ్‌కి విలన్‌గా నటిస్తూ బాగా ఎంజాయ్ చేశానంటున్నాడు.
లోకేష్ కనకరాజ్ నా కేరెక్టర్‌ని చాలా భయంకరంగా రాసుకున్నాడని.. మాస్టర్ సినిమాలో తానొక భయానకమైన గ్యాంగ్ స్టార్‌గా నటించానని చెబుతున్నాడు విజయ్ సేతుపతి. ప్రతి వ్యక్తిలోనూ చెడు ఉంటుంది. ఆ చెడుని వదిలించుకోవడానికి మార్గం ఉంటుందా? లేదా? అనే విషయంపై నాకు క్లారిటీ లేదు. కానీ ఓ నటుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తున్నప్పుడు మాత్రం అతనిలోని చెడ్డ వ్యక్తి బయటికి వస్తాడు. మాస్టర్‌లో నేనొక భయంకరమైన గ్యాంగ్ స్టార్‌గా నటించాను.. విజయ్‌కి విలన్‌గా నటిస్తున్నప్పుడు ఆ కేరెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేశాను అని చెబుతున్నాడు విజయ్ సేతుపతి.
మరి మాస్టర్ సినిమా కరోనా రాకపోతే మార్చిలోనే విడుదలకావాల్సింది. కానీ థియేటర్స్ బంద్ వలన మాస్టర్ వాయిదా పడింది. ఇక థియేటర్స్ తెరుచుకున్నాయి. మరి మాస్టర్ డేట్ ఎప్పుడు వదులుతారో అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఉన్నారు.