Advertisement
Google Ads BL

అనుష్క పని ఇక అయిపోయినట్లేనా?


అనుష్కకి సైజ్ జీరో కష్టాలు ఇక వదలవనే అనిపిస్తుంది. ఆ సినిమా కోసం పెరిగిన బరువు తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడినా వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే సినిమాలు తగ్గించేసింది. అనుష్క తగ్గించిందా.. లేదంటే దర్శకులే అనుష్కని పక్కనబెట్టారా అనే విషయం క్లారిటీ లేదు కానీ... అనుష్క లేటెస్ట్ మూవీ నిశ్శబ్దంతో అనుష్క కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడినట్లే అనిపిస్తుంది. బాహుబలి, భాగమతి తర్వాత భారీ గ్యాప్‌తో నిశ్శబ్దం సినిమా చేసిన అనుష్కకి ఆ సినిమా వలన ఉపయోగమే లేదు. నిశ్శబ్దం సినిమా పూర్తయిన ఏడాదికి థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో అనుష్క మ్యూట్ కేరెక్టర్‌లో బాగా బరువైన కేరెక్టర్ చేసింది.

Advertisement
CJ Advs

అనుష్క మెయిన్ లీడ్ అన్నప్పటికీ... సినిమాలో అంజలి కేరెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ అనుష్క‌కి లేకుండా పోయింది. అంజలి పోలీస్ కాప్‌గా బాగా హైలెట్ అయ్యింది. అనుష్క కేరెక్టర్ ని హైలెట్ చేస్తూ సన్నివేశాలు లేవు. కానీ అనుష్కని ముందు పెట్టి నిర్మాతలు మాత్రం నిశ్శబ్దం బిజినెస్ చేసేశారు. అంజలి, షాలిని పాండే కి క్రేజ్ లేని కారణముగా అనుష్క కేరెక్టర్ నిశ్శబ్దంలో హైలెట్ అనేలా పోస్టర్స్ పెట్టి సినిమాని అమ్మేశారు. కానీ సినిమాలో అనుష్క కన్నా అంజలికే స్కోప్ ఎక్కువగా ఉంది. ఇక అనుష్క లుక్స్ పరంగా తేలిపోయింది. డ్రెస్సెస్ బాలేదు. ఇక నిశ్శబ్దానికి ప్లాప్ టాక్ రావడంతో అనుష్కకి అవకాశాలు రావని... ఇప్పుడు సన్నబడిన ఉపయోగం లేదని.. ఇక నిశ్శబ్దం తర్వాత అనుష్క కెరీర్‌కి శుభం కార్డు పడడం ఖాయమంటున్నారు.

No importance to Anushka role in Nishabdham:

Not Anushka.. Anjali highlight in Nishabdham Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs