ఇక ఓటీటీల పని అయిపోయినట్లే..!!


కరోనా కారణంగా అన్ని రకాల సంస్థలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు.. ఇలా చిన్న పెద్ద అన్నిరకాల విషయాల్లో లాస్ మిగిలింది. సినిమా పరిశ్రమ అయితే అతలాకుతలం అయ్యింది. సినిమా పరిశ్రమ ఎప్పటికి కోలుకుంటుందో కూడా అర్ధం కానీ పరిస్థితి. కరోనా కారణంగా ఎవరెలా ఉన్నా, ఎన్ని పరిశ్రమలు చేతులెత్తేసినా ఓటీటీ సంస్థలు మాత్రం బాగా క్యాష్ చేసుకున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ 5, సన్ డైరెక్ట్, ఆహా ఇలా చాలా ఓటిటి సంస్థలు లాభాలు గడించాయి. 

థియేటర్స్ బంద్ కారణంగా ప్రేక్షకులంతా ఓటీటీలకు ఎగబడ్డారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా క్రేజ్ ఉన్న సినిమాలను భారీ రేట్లు పెట్టి కొని ప్రేక్షకులను తమ వైపు తిప్పేసుకున్నారు. అలాగే వెబ్ సీరీస్‌లతో ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యాకే మా సినిమాలు విడుదల అన్నవాళ్లకు డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పేసుకుని భారీగా ప్రేక్షకులను పట్టేశాయి. అందులో అమెజాన్ ప్రైమ్ కొత్త, క్రేజ్ ఉన్న సినిమాలను కొనేసి టాప్‌లో ఉంది. అనుష్క, నాని ఇలా చాలామంది హీరోలకి గాలం వేసి సక్సెస్ అయ్యింది. 

అయితే థియేటర్స్ బంద్ వలన ఓటీటీ సంస్థలు లాభపడ్డాయి. మరి అన్ లాక్ 5.ఓ మొదలయ్యాక ఈ నెల 15 నుంచి థియేటర్స్ మొత్తం 50శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోనున్నాయి. మరి థియేటర్స్ తెరుచుకుంటే ఓటీటీలు మళ్ళీ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలని డిజిటల్ రైట్స్‌ని కొనుక్కోవాలి. ఈలోపు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు మళ్ళీ ఓటీటీలో చూడరు. సో థియేటర్స్ ఓపెనింగ్ కారణంగా ఓటీటీలకు కళ్లెం పడినట్లే. 

OTT craze downed with Theaters open news:

Clarity about Theaters open.. what about OTTS?
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES