Advertisement
Google Ads BL

పవన్ - హరీష్ శంకర్.. ‘మిరపకాయ్ 2’?


పవన్ - హరీష్ శంకర్ కాంబో అనగానే ఆ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు వచ్చేస్తున్నాయి. గతంలో గబ్బర్ సింగ్ హిట్ అవడంతో ఆ కాంబోపై మార్కెట్ లో పిచ్చ క్రేజ్ ఉంది. పవన్ పుట్టిన రోజున ప్రీ లుక్ పోస్టర్ అంటూ ఆసక్తికరంగా ఓ పోస్టర్‌ని వదిలారు. అయితే పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలపై ఎలాంటి కామెంట్స్ చెయ్యకపోయినా.. దర్శకులు మాత్రం తమతో పవన్ చేసే సినిమాలను సోషల్ మీడియాలో తెగ హైలెట్ చేస్తున్నారు. అయితే తాజాగా హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ అవతారం ఎత్తబోతున్నాడని.. అయితే వారి కాంబోలో రాబోయే సినిమా రవితేజ - హరీష్ శంకర్ సినిమా మిరపకాయ్‌లా ఉండబోతుంది అనే టాక్ మొదలయ్యింది.

Advertisement
CJ Advs

 

హరీష్ శంకర్ గతంలో రవితేజతో మిరపకాయ్ సినిమా చేసాడు. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ విలన్స్‌ని పట్టుకోవడానికి ఓ కాలేజ్‌లో హిందీ లెక్చరర్‌గా జాయిన్ అయ్యి చివరికి ఆ విలన్స్ ముఠా అటకట్టించినట్టుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో హరీష్ ఇలాంటి థీమ్‌లోనే కథ అల్లుకున్నాడని.. అటు ఇటుగా ఈ సినిమా మిరపకాయ్‌లా ఉండబోతుంది అంటే మిరపకాయ్ 2 గా తెరకెక్కిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి గతంలో మిరపకాయ్ కథ పవన్ కోసం రెడీ చేసిన హరీష్‌కి అవకాశం ఇవ్వలేదు పవన్. అందుకే మిరపకాయ్ కథని రవితేజతో చేశాడు హరీష్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి కథతోనే పవన్‌ని హరీష్ శంకర్ మెప్పించాడని అంటున్నారు.

Gossips on Pawan Kalyan and Harish Shankar combo Movie:

Harish Shankar Mirapakay movie based story for Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs