Advertisement
Google Ads BL

బజ్‌లేని బుజ్జిగాడి పరిస్థితేంటో..?


ప్రస్తుతం థియేటర్స్ బంద్ ఉండడంతో సినిమాలన్ని ఓటీటీ అంటున్నాయి. మంచి ధర రాగానే సినిమాలని ఓటీటీలకి అమ్మి చేతులు దులిపేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ‘వి’ సినిమాని ఓటీటీలో విడుదల చేసినా ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. నాని, నివేద థామస్, సుధీర్ బాబు, ఇంద్రగంటి ఇలా ప్రతి ఒక్కరూ చేసిన పబ్లిసిటీ సినిమాకి హైప్ రావడానికి కారణమైంది. ఇక తాజాగా రేపు విడుదల కాబోతున్న నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాలకు మార్కెట్‌లో అస్సలు బజ్ లేదు. థియేటర్స్‌లో విడుదలైతే ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ హడావిడి చేస్తే సినిమా విడుదలవుతుంది అని ప్రేక్షకులకి వెళ్ళేది. దానితో టికెట్స్ తెగేవి. కానీ ఓటిటీలకి అమ్మేశాక అసలు సినిమాలు హిట్టా ఫట్టా అనేది తెలియడం లేదు. అందుకే మూవీ టీం కూడా సినిమా పబ్లిసిటీ విషయంలో లైట్ గా ఉంటున్నారు.

Advertisement
CJ Advs

మరి చాలా సినిమాలు ప్లాప్‌తో ఉండడంతో రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా ఓటిటి‌లో వచ్చేస్తుంది అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. అది ఎప్పుడు విడుదలవుతుందా అనే క్యూరియాసిటీ ఎవరిలో లేదు. ఆనుష్క నిశ్శబ్దం పై ఉన్న ఆసక్తి ఒరేయ్ బుజ్జిగా మీద రాలేదు. అందులో కొత్తగా పెట్టిన ఆహా ఓటిటిలో ఒరేయ్ బుజ్జిగా వస్తుంది. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేసినా, కామెడిగా ట్రైలర్ కట్ చేసిన సినిమాపై అనుకున్న బజ్ మాత్రం బయట లేదు. 

మరి థియేటర్స్‌లో పోటీపడినా ఓ అందం... కానీ ఓటీటీలోను అనుష్క నిశ్శబ్దానికి ఒరేయ్ బుజ్జిగా పోటీ పడడం అవివేకమే. మరి అమెజాన్ ప్రైమ్‌లో నిశ్శబ్దానికి ఉన్న క్రేజ్ ఆహా ఒరేయ్ బుజ్జిగాకి కనిపించడం లేదు. కనీసం రాజ్ తరుణ్ అయినా హిట్స్‌లో ఉండి ఉంటే సినిమాకి క్రేజ్ ఉండేది. మరి ఆహాలో విడుదల కాబోతున్న ఒరేయ్ బుజ్జిగా షో పడ్డాక హిట్ టాక్ పడి.... అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప... లేదంటే సినిమా లేచే పరిస్థితులు లేవు.

Raj Tarun Orey Bujjigaa vs Anushka Nishabdham:

No Craze on Raj Tarun Orey Bujjigaa Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs