సుకుమార్‌కి రంగస్థలం లాంటి భారీ హిట్ పడినా.. ఆయనతో సినిమా చేసేందుకు మహేష్ తెగ ఆలోచించాడు. సుకుమార్‌తో కమిట్ అయిన మూవీని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన పక్కనపెట్టేశారు మహేష్. ఆ సినిమా కథతోనే సుకుమార్ అల్లు అర్జున్‌ని పడేశాడు. అయితే సుక్కు, అల్లు అర్జున్ చెప్పిన కొన్ని విషయాలకు తలొగ్గాడు కాబట్టే ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవల్‌కి వెళ్ళింది. కొన్ని విషయాలంటే.. సుక్కు ఓన్ బ్యానర్ లాంటి మైత్రి మూవీస్‌తో తన చుట్టాలు కూడా నిర్మాతలుగా కలవడం, అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌కి మార్పులు చెయ్యమని చెప్పడం. ఇక సుకుమర్ అల్లు అర్జున్ కండీషన్స్‌కి ఒప్పుకున్నా.. కొన్ని విషయాల్లో తన పంతం నెగ్గించుకున్నాడు.
అయితే తాజాగా సుకుమార్ - విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యంలో పడేసింది. అసలు ఎప్పుడు ఎక్కడా.. వాడుకలో లేని కాంబో. అయితే సుకుమార్‌తో విజయ్ దేవరకొండ సినిమా కమిట్ చేయించాడు. ఇక్కడా సుకుమార్‌ని విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్‌తో కలిసి భారీ పారితోషకానికి పడేశాడనే టాక్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది. అల్లు అర్జున్ తర్వాత తన మూవీని పాన్ ఇండియా లెవల్లో చేయడానికని.. సుకుమార్‌కి తన ఫ్రెండ్ నిర్మాత అయిన కేదర్‌తో 10 కోట్ల అడ్వాన్స్ ఇప్పించాడట. ఇక పారితోషకం కూడా భారీ లెవల్లో ఉండబోతుందట.
అందుకే సుకుమార్ కూడా తన సొంత నిర్మాణ సంస్థలా మెలిగిన మైత్రి మూవీస్ నుండి బయటికి వచ్చేసాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2022లో మొదలు కాబోయే సినిమాకి ఇప్పుడు 10 కోట్ల అడ్వాన్స్ అంటే సుక్కు దశ తిరిగినట్టే. అందులోను స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా లెవల్ మూవీ అంటే మాటలు కాదు. సో అందుకే మైత్రి వారిని సుక్కు పక్కనపెట్టేసాడనే టాక్ మాత్రం స్ప్రెడ్ అవుతోంది.