సుశాంత్ సింగ్ మరణంపై ఎటువంటి అనుమానాలు లేవు.... అది ఆత్మహత్యే అని ఎయిమ్స్ రిపోర్ట్ ఇచ్చేసింది. కానీ సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ముడిపడిన డ్రగ్స్ కేసు మాత్రం ఇప్పట్లో ఒకకొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యతో వెలుగులోకొచ్చిన డ్రగ్స్ కేసు సుశాంత్ సింగ్ రాజపుత్ లవర్, గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మెడకి చుట్టుకుంది. అది కాస్తా బాలీవుడ్ టాప్ స్టార్స్‌కి, సౌత్ హీరోయిన్ రకుల్ మీదకి చుట్టేసింది రియా చక్రవర్తి. అయితే ఎంసీబీ ఎదుట నిలబడిన రియా.. దీపికా పదుకొనె, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్, రకుల్ పేర్లు చెప్పగా.. అందులో రకుల్ కాస్త తెలివిగా తనని మీడియా బాధపెడుతోంది... కాస్త కంట్రోల్‌లో ఉంచమని కోర్టుకెక్కింది. తర్వాత సైలెంట్‌గా ఎన్సీబీ విచారణకు హాజరైంది.
ఇక దీపికా, సారా, శ్రద్ద కపూర్ లను ఎన్సీబీ డ్రగ్స్ కేసులో విచారించగా ఈ హీరోయిన్లు అందరూ తమకు డ్రగ్స్ సేవించే అలవాటు లేదని, కేవలం సిగరెట్స్ తాగుతామని, కానీ డ్రగ్స్ చాటింగ్ చేశామంటూ చెప్పి ఎన్సీబీకి అర్థం పర్థం లేని సమాధానాలు ఇవ్వడంతో.. మరోసారి దీపికా, సారా, శ్రద్ద, రకుల్ లను ప్రశ్నించేందుకు ఎన్సీబీ రెడీ అవుతుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో మరో 3 టాప్ హీరోలకు విచారణ కోసం సమన్లు జారీ చేయబోతున్నారట. అంతేకాకుండా టాలీవుడ్‌లో కొంతమందిని ఈ ఎన్సీబీ విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీపికా ఎన్సీబీ ఎదుట రెండుమూడుసార్లు ఏడ్చినా ఎన్సీబీ మాత్రం దీపికాను వదిలేలా కనిపించడం లేదు.
సుశాంత్‌తో డేటింగ్ చేశాను, పార్టీలకు వెళ్తా కానీ డ్రగ్స్ తీసుకోను అనీ సారా అలీఖాన్, సుశాంత్ తో పార్టీలు చేసుకున్న మాట నిజమే కానీ డ్రగ్స్ తీసుకోలేదనిస్ శ్రద్దా కపూర్, నేను సిగరెట్స్ కాల్చే అలవాటుతోనే కరిష్మా తో కోడ్ లాంగ్వేజ్ తో చాట్ చేశా కానీ.. డ్రగ్స్ కోసం కాదని దీపికా, నేను డ్రగ్స్ వాడను నా ఫ్రెండ్ రియా చక్రవర్తే నా ఇంట్లో డ్రగ్స్ దాచుకుంది అని రకుల్.. ఇలా ఎవరికీ వారే తెలివిగా తప్పించుకోవడానికి చూసినా.. ఎన్సీబీ మాత్రం మిమ్మల్ని వదలం.. మళ్లీ విచారణ అంటుంది. ఇక బాలీవుడ్‌లో టాప్ నటుల్ని ఎన్సీబీ ఈ విచారణకు పిలబోతుంది అనే విషయం మీడియాకి తెలిశాక వాళ్ళు ఎవరనే దానిమీద మీడియా ఫోకస్ పెట్టింది. ఇక రకుల్ ఎన్సీబీ విచారణ తర్వాత సైలెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి.. కామ్‌గా తన షూటింగ్ స్పాట్‌కి వెళ్లిపోయింది.