Advertisement
Google Ads BL

గుర్తుందా శీతాకాలం.. తమన్నాతో పాటు మరో భామ..?


పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో హీరోగా కనిపించిన సత్యదేవ్, బ్లఫ్ మాస్టర్ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత అతడు హీరోగా వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకుంది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది.

Advertisement
CJ Advs

ఈ సినిమా అనంతరం సత్యదేవ్, గుర్తుందా శీతాకాలం అనే సినిమా స్టార్ట్ చేసాడు. కన్నడ చిత్రమైన లవ్ మాక్ టైల్ సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. ఐతే ఈ సినిమాలో తమన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందట. ఆ పాత్ర చాలా కీలకంగా సినిమాలో మలుపులకి కారణం అవుతుందట.

ప్రస్తుతం ఆ పాత్ర కోసం మరో హీరోయిన్ ని వెతుకుతున్నారట. ప్రియా భవాని శంకర్ ని ఆ పాత్రలో తీసుకోవాలని చూస్తున్నారట. మరి తమన్నా హీరోయిన్ గా కనిపిస్తున్న సినిమాలో కనిపించే మరో హీరోయిన్ ఎవరో చూడాలి. నాగశేఖర్ మూవీ బ్యానర్లో నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Another heroine in Tamannas Gurthunda Seethakalam?:

Another heroine in Tamannas Gurthunda Seethakalam?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs