విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌తో కలిసి ఫైటర్ సినిమాని పాన్ ఇండియా ఫిలింగా మార్చేశాడు. అసలు పూరి ఆ కథని కేవలం సౌత్ కోసమే రాసుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆ కథ పాన్ ఇండియాకి సరిపోతుంది అని.. కొద్దిగా మార్పులతో పాన్ ఇండియా ఫిలింగా మార్చేశాడు. ఇక తర్వాత విజయ్ దేవరకొండ, శివ నిర్వాణతో ఓ మూవీ చేస్తాడని అందుకు గాను అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇక దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ మూవీ ఉంటుంది అనుకున్నారు. అయితే తర్వాత విజయ్ దేవరకొండ ఓ స్ట్రయిట్ బాలీవుడ్ ఫిలిం చేస్తున్నాడని.. అది కూడా దేశభక్తుడు అభినవ్ బయోపిక్‌లో నటించబోతున్నాడని అన్నారు. అప్పటినుండి శివ నిర్వాణ మూవీని, దిల్ రాజు మూవీని విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో అనుకున్నారు. కానీ తాజాగా విజయ్ దేవరకొండ శివ నిర్వాణకు, దిల్ రాజుకి పక్కాగా హ్యాండ్ ఇచ్చేసినట్టే కనబడుతుంది.
తాజాగా విజయ్ దేవరకొండ, సుకుమార్‌తో పాన్ ఇండియా మూవీ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అసలు ఇంతవరకు ఈ డైరెక్టర్‌తో విజయ్ పేరు ముడిపడలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తున్న సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో ఫిక్స్ చేసుకున్నాడు. కానీ విజయ్ ఫైటర్ తర్వాత అభినవ్ బయోపిక్ లో నటిస్తాడట. తర్వాత సుకుమార్ మూవీ అంటున్నారు. ఇక మధ్యలో దిల్ రాజు మూవీ, శివ నిర్వాణ మూవీలు విజయ్ వదిలేసినట్టే అనిపిస్తుంది.
ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా విడుదల కాకుండానే విజయ్ దృష్టి మొత్తం పాన్ ఇండియా మీదే ఉంది. ప్రభాస్ లాగా విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా మూవీస్ తప్ప సౌత్ మూవీస్ చెయ్యడేమో అని అందరూ ఫిక్స్ అవుతున్నారు.