పవన్ కళ్యాణ్ ఈ ఏడాది స్టార్టింగ్ వరకు సినిమాల మీద ఆసక్తి ఉన్నట్లుగా కనబడలేదు. కానీ వకీల్ సాబ్ మొదలెట్టాక మళ్ళీ రాజకీయాలంటాడేమో అనుకుంటే.. క్రిష్ సినిమా కమిట్ అయ్యాడు. అంతేనా హరీష్ శంకర్‌తో మరో సినిమా కమిట్ అయ్యి అందరికి షాకిచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ తర్వాత పూరి, త్రివిక్రమ్, డాలిలతో సినిమాలు చేస్తాడంటూ ప్రచారం జరిగినా.. లేదు పవన్ మళ్ళీ రాజకీయాలపై దృష్టి పెడుతున్నాడు. సినిమాలు ఇక చెయ్యడు. హరీష్ శంకర్ సినిమా తర్వాత పవన్ ఇక హైదరాబాద్‌లో ఉండడు.. అబ్బో ఇలా చాలా రకాల న్యూస్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. కానీ పుట్టిన రోజు వచ్చేసరికి సురేందర్ రెడ్డి మూవీ ప్రకటించి అందరికి షాకిచ్చిన పవన్ కళ్యాణ్ ఇక వరస సినిమాలు చేస్తాడనే అందరూ ఫిక్స్ అయ్యారు. కాకపోతే తర్వాత ఎవరితో సినిమా ఉంటుంది అనే దానిమీద అందరూ ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. కారణం మళ్ళీ ఈ నాలుగు సినిమాలు చేసాక పవన్ రాజకీయాలు ఎన్నికలంటాడు.
అందుకే కామ్‌గా ఉంటున్నాడు అనుకుంటే నిన్న బండ్లతో సినిమా చేస్తానని మాటిచ్చేసాడు. అంటే గతంలో నిర్మాతలకు మాటిచ్చి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. నిర్మాతలను తిప్పుకున్నట్టుగా బండ్లని కూడా తిప్పుకుంటాడా? లేదంటే సురేందర్ రెడ్డి తర్వాత బండ్ల నిర్మాతగా డాలి దర్శకత్వంలో సినిమా మొదలెట్టేస్తాడా? అసలు పవన్ మదిలో ఏముంది. 2024 లో ఎన్నికలు. ఈలోపు ఐదు సినిమాలు కంప్లీట్ చేయడం పవన్ కి వీలవుతుందా? అది పవన్ కే తెలియాలి.
అసలు సినిమాలు చేస్తూ రాజకీయాలంటాడా? లేదంటే సినిమాలు పక్కనబెట్టి రాజకీయాలంటాడా? కాదు సినిమాలే ముద్దు రాజకీయాలే టైం పాస్ అంటాడా? అసలు పవన్ ఆలోచన ఏమిటి అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ కొట్టేసుకుంటున్నారు.