Advertisement
Google Ads BL

పర్ ఫార్మెన్స్ అనగానే ఆమెవైపే చూస్తున్నారు..


ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిన సాయి పల్లవి, ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ హీరోయిన్ గా మారుతుంది. నటనా ప్రాధాన్యమున్న సినిమాల్లో తప్ప గ్లామర్ డాల్స్ గా కనిపించనని తెగేసి చెప్పిన సాయిపల్లవికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాగ చైతన్య లవ్ స్టోరీతో పాటు రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు వాటి చిత్రీకరణ చివరి దశకి వచ్చేసాయి.

Advertisement
CJ Advs

థియేటర్లు తెరుచుకోగానే ఒకదాని వెంట ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉంటాయి. ఐతే ఇవే గాక సాయి పల్లవి ఖాతాలో మరో రెండు సినిమాలు చేరాయి. నాని హీరోగా రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని తెలిసిందే. దీనితో పాటు శర్వానంద్ సినిమాలోనూ హీరోయిన్ గా కనిపించనుందట. శ్రీకారం సినిమాతో బిజీగా ఉన్న శర్వానంద్, మహా సముద్రం సినిమాతో పాటు మరో సినిమాని లైన్లో పెడుతున్నాడని టాక్.

హీరో రామ్ తో రెడ్ సినిమా తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా ఉండనుందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని, అందుకోసం సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. శర్వా కూడా ఓకే చెప్పేసాడని, అందుకే సాయి పల్లవితో సంప్రదింపులు జరుపుతున్నారని వినబడుతుంది. నటనకి ఆస్కారమున్న కథ కాబట్టి సాయి పల్లవి తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు.

ఇదొక్కటే కాదు సాయి పల్లవి చేస్తున్న లవ్ స్టోరీ, విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాలన్నీ నటనా ప్రాధాన్యమున్నవేనట. మొత్తానికి సాయి పల్లవి కెరీర్ అనుకున్నట్లుగానే సాగుతుంది.

Sai Pallavi next movie with..:

Sai Pallavi next movie with..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs