Advertisement
Google Ads BL

అవతార్ 2 షూటింగ్ పూర్తయ్యిందట.. కానీ..!


హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన వెండితెర అద్భుతం.. అవతార్. ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఒక సినిమా ఆ రేంజిలో వసూళ్ళు రాబట్టగలదా అన్న ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఐతే అవతార్ సినిమా తర్వాత దానికి మూడు సీక్వెల్స్ ఉంటాయని చెప్పిన జేమ్స్ కామెరూన్, చాలా రోజులుగా వాటిమీదే వర్క్ చేస్తున్నాడు. అవతార్ సినిమాలో పండోరా గ్రహానికి తీసుకెళ్ళిన కామెరూన్, ఈ సారి నీటిలో అద్భుతాలని చూపించబోతున్నాడు.

Advertisement
CJ Advs

నిజానికి అవతార్ 2 చిత్రం 2021డిసెంబరులో రావాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ చిత్రం 2022డిసెంబరు కి వాయిదా పడింది. ఐతే అవతార్ 2 షూటింగ్ పూర్తయ్యిందట. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉండే చిత్రం కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా చాలా రోజులుగా వర్క్ జరగట్లేదు. సో అవతార్ 2 వాయిదా తప్పలేదు. అంటే పండోరా గ్రహంపై విహరించాలంటే రెండు సంవత్సరాలు వరకూ వెయిట్ చేయాల్సిందేనన్నమాట.  

Avatar 2 Shoot completed.. But..!:

Avatar 2 Shoot completed.. But..!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs