Advertisement
Google Ads BL

బిగ్‌బాస్: ఆమె ఎలిమినేషన్‌ సిల్లీ థింగ్‌..!


బిగ్‌బాస్ సీజన్ 4 లో అసలే చిన్న చిన్న పేరు లేని కంటెస్టెంట్స్‌తో చప్పగా స్టార్ట్ అయ్యింది అంటే.. ఎలాగో టాస్క్ ల పేరు చెప్పి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు అంటించి.. నామినేషన్స్  పేరు మీద అందరిలో చిచ్చు రగిలించి.. కాస్త దారిలోకి తెచ్చిన యాజమాన్యం మళ్ళీ ఇప్పుడు ఓ పిచ్చి పని చేసి ట్రోలింగ్‌కి గురైంది. బిగ్‌బాస్ హౌస్ గురించి సీజన్ 4 గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ అవుతుంటే ఇప్పుడు చిన్నా చితక కంటెస్టెంట్స్‌ని హౌస్‌లో ఉంచి మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయడమనేది బిగ్‌బాస్ సీజన్ 4 లో చేసిన అతిపెద్ద మిస్టేక్ అనిపిస్తుంది. కుమార్ సాయి, సోహెల్, మెహబూబ్, అరియనా, గంగవ్వ లాంటి వీక్ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లో ఉంచి దేవి నాగవల్లిని ఎలిమినేషన్ ద్వారా బయటికి పంపడమనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ కానివ్వండి, స్టాండ్ తీసుకోవడం కానివ్వండి, పనిలో కానివ్వండి ఎందులోనైనా దేవితో పోటీ పడేది కేవలం ఆబ్బాయిలు మాత్రమే అనేలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి. అలాంటి అమ్మాయిని ఎలిమినేషన్‌లో ఉంచి ఫైనల్‌గా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. టివి 9 మీదున్న నెగెటివిటి దేవి మీద పడింది అని కొందరు.... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాలనే దేవి నాగవల్లిని ఎలిమినేట్ అయ్యేలా ఓట్స్ వేశారంటూ ఏవేవో సోషల్ మీడియాలో వినిపిస్తున్నా దేవి నాగవల్లి ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం భీభత్సముగా సాగుతుంది. కుమార్ సాయి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి వేస్ట్ అనిపించుకున్నాడు. 

అలాంటి కంటెస్టెంట్ ని ఉంచి దేవిని ఎలిమినేట్ చెయ్యడం నిజంగా పొరబాటే. టాస్క్ లో వీరత్వం, మాటల్లో సూరత్వం లాంటి దేవిని ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ హౌస్ ఎలా వీక్ కంటెస్టెంట్స్ తో ఎంతసేపు డ్రామా ప్లే చేస్తారో.. ఏ విధంగా టీఆర్పీ పెంచుకుంటారో చూస్తామంటున్నారు ఇంటిలిజెన్స్.

Devi Nagavaali eliminated from Bigg Boss:

Bigg Boss did big mistake with devi elimination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs