Advertisement
Google Ads BL

రియాకు సపోర్ట్ చేసి ఫ్రెండ్‌ని వదిలేసిందేంటి?


బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య విషయంలో, అలాగే సుశాంత్ సింగ్ డబ్బుని బ్యాంక్ ఖాతా నుండి మరల్చిందనే కారణముగా అరెస్ట్ అయిన రియా చక్రవర్తిని మీడియా ఓ ఆటాడుకుంది. రియాని సిబిఐ, ఎన్‌సీబీ ఎలాంటి ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టారో తెలియదు కానీ.. మీడియా మాత్రం రియా చక్రవర్తికి డైరెక్ట్‌గా శిక్ష వేసింది. ఆమె కదిలినా న్యూస్, మెదిలింది న్యూస్, అసలు మీడియా మిత్రులు రియని పిసికి పాకం పెట్టారు. ఈ విషయంలో మీడియా ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. అసలు రియా బయట ఉండడం కన్నా జైలుకి వెళ్లడమే మేలు అనుకునేలా చేసింది మీడియా. ఆ విషయంలో రియా చక్రవర్తిని చాలామంది సపోర్ట్ చేసారు. సెలబ్రిటీస్ కూడా రియాతో మీడియా అలా ప్రవర్తించడంపై తప్పుబట్టారు. అలాగే రియా చక్రవర్తిని సపోర్ట్ చేసిన వారిలో సౌత్ హీరోయిన్ మంచు లక్ష్మి కూడా ఉంది. ఒక్క అమ్మాయిని అలా కార్నర్ చేసి ఏడిపించడం కరెక్ట్ కాదని అంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఆమె ఫ్రెండ్ రకుల్ ప్రీత్, రియాని ఇరికించిన డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ ముందు విచారకు హాజరైంది. కానీ రకుల్ ప్రీత్ కి క్లోజ్ జిగిరి ఫ్రెండ్ లక్ష్మి మంచు మాత్రం నోరు విప్పడం లేదు. మరి రకుల్ - లక్మి మంచులు ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెలుసు. కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటుంది. కానీ లక్ష్మి మంచు మాత్రం రకుల్ ని సపోర్ట్ చేస్తూ ఒక్క ట్వీట్ వెయ్యడం లేదు. 

రకుల్ తప్పుచేయలేదని కానీ, డ్రగ్స్ తీసుకోలేదని కానీ వాదించడం లేదు. అయినా రకుల్ నేను డ్రగ్స్ వాడలేదు కాదు.. రియా డ్రగ్స్ నా ఇంట్లోనే దాచుకుంది అని చెప్పాక ఎవరు మాత్రం రకుల్ కి సపోర్ట్ చేస్తారు. 

Why Tollywood Silent On Rakul Preet Singh And Drug Scandal?:

Manchu Lakshmi Supports Rhea, Why Silent On Rakul?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs