Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేసు: నమ్రత హుందాతనం చూపింది


బాలీవుడ్ డ్రగ్స్ కేసు కాస్తా టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరవడమే కాదు.. తానేమి తప్పు చేయలేదని.. తన ఫ్రెండ్ రియా చక్రవర్తి తన దగ్గర డ్రగ్స్ దాచుకుంది అని చెప్పింది. మరి డ్రగ్స్ దాచుకుంది అంటే.. రకుల్ తెలిసి రియాకి సహకరించినట్టే. రియా, రకుల్‌ని ఇరికిస్తే.. రకుల్, రియాని ఇరికించినట్టుగా అయ్యింది. అదలా ఉంటే.. బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీఖాన్, దీపికా, శ్రద్ద కపూర్‌లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చెయ్యడమే కాకుండా ఈ డ్రగ్స్ కేసులో మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ పేరు ఉన్నట్టుగా నేషనల్ మీడియాలో ప్రసారం కావడంతో.. సౌత్ మీడియా కూడా నమ్రత విషయంలో అనుమానాలు వ్యక్తం చేసింది.

Advertisement
CJ Advs

అంటే ఈ కేసులో నమ్రత కూడా ఇన్వాల్వ్ అయ్యిందా? అలాగే నమ్రత ఆడియో టేపులని మీడియాలో ప్రచారం చేశాయి ఛానల్స్. అయితే గత రెండు రోజులుగా దీపికా విచారణ, శ్రద్ద, సారా, రకుల్ విచారణ అంటూ ఎన్‌సీబీ ఎంక్వైరీ చేస్తున్నా.. ఎక్కడా నమ్రత పేరు బయటికి రాలేదు. అసలు ఈ కేసులో తమకు సంబంధం లేదని, అనవసరంగా తమని బద్నామ్ చేస్తున్నారని కానీ నమ్రత ఎక్కడా స్పందించలేదు. అలా హుందాగా ఉండడమే ఇప్పుడు వాళ్లకు కలిసొచ్చింది. 

నమ్రత అనవరసరంగా రంగంలోకి దిగి ఈ కేసు విషయంలో స్పందిస్తే తర్వాత.. వాళ్ళ పేరు ఎన్‌సీబీ బయటపెట్టకపోతే పెంట పెంట అయ్యేది. ఎలాగూ ఎన్‌సీబీ నమ్రత పేరు చెప్పలేదు. ఇక జాతీయ మీడియాలోనూ నమ్రత పేరు బయటికి రాకపోయేసరికి ఇక డ్రగ్స్ కేసులో నమ్రత లేదని అందరూ ఫిక్స్ అవుతున్నారు.

Drugs Scandal: Gossips on Namrata Shirodkar:

Namrata Shirodkar not in Drugs Scandal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs