Advertisement
Google Ads BL

బిగ్‌బాస్‌.. వైల్డ్ కార్డ్ ఓకే.. గెస్ట్‌ల పర్వం ఎప్పుడు?


బిగ్ బాస్ అన్నాక వైల్డ్ కార్డులు సహజం. కాకపోతే సీజన్ 4 కి మాత్రం మొదటి మూడు వారాలే ముగ్గురు వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. గత సీజన్స్‌లో అయితే షో మొదలైన 15 రోజులకే, నెల రోజులకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ బిగ్ బాస్‌లోకి ఉండేది. కానీ సీజన్ 4 లో మాత్రం మూడు వారాలకే పొలోమంటూ మూడు వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చేసారు. అయితే అందులో కుమార్ సాయి అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. ఇక జబర్దస్త్ అవినాష్ మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీతో బుల్లితెర ప్రేక్షకులని ఫుల్‌గా శాటిస్ఫాయ్ చేస్తున్నాడు. ఇక మూడో వైల్డ్ కార్డు.. స్వాతి దీక్షిత్.. మంచి స్ట్రాటజీతో బరిలోకి దిగినట్లుగా కంటెస్టెంట్ లాస్య ఆరోపణ. ఇక స్వాతి దీక్షిత్ హాట్ హాట్ గా మాత్రం అదరగొట్టేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక వైల్డ్ కార్డులు ఓకే.. ఇప్పుడు గెస్ట్‌ల విషయంలో బిగ్ బాస్ సీజన్ 4 లో సస్పెన్స్ స్టార్ట్ అయ్యింది. గతం సీజన్స్ లో తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హీరో హీరోయిన్స్ చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బుల్లితెర ద్వారా సినిమాలను ప్రమోట్ చేసుకునేవారు. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాల ప్రమోషన్స్ కొరకు బిగ్ బాస్ స్టేజ్ ఎక్కారు. అయితే ఇప్పుడు థియేటర్స్ మూతబడినా.. కొన్ని సినిమాలు ఓటిటి ద్వారా ప్రేక్షకుల వద్దకు వచ్చేస్తున్నాయి. అందులో అనుష్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగాలు అక్టోబర్ 2 న ఓటిటి ద్వారా విడుదల కాబోతున్నాయి. 

సోషల్ మీడియాలో ఆ సినిమాల ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలతో ప్రెస్ మీట్స్, ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఆపేసారు. కానీ సోలోగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. మరి ఇలాంటి కరోనా టైంలో అనుష్క బ్యాచ్, రాజ్ తరుణ్ వాళ్ళు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి సినిమాలను ప్రమోట్ చేసుకుంటారా? లేదంటే కరోనా కారణంగా బిగ్ బాస్ యాజమాన్యం గెస్ట్‌లకు నో ఎంట్రీ బోర్డు పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది.

Where is Celebrity guests for Bigg Boss 4?:

Bigg Boss entertain with Wild Card entries
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs