Advertisement
Google Ads BL

ప్రియుడి కోసం నయన్.. లెక్కచేయడం లేదుగా?


కోలీవుడ్ ప్రేమ పక్షులు విగ్నేష్ శివన్ - నయనతారలు పెళ్లి చేసుకోకుండా ప్రేమించుకుంటూనే ఉంటారు. పెళ్లి పేరెత్తితే.. మాకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. మా పెళ్లి గురించి మీకెందుకు కంగారు అంటున్నారు. ఇక విగ్నేష్ శివన్ - నయనతారలు పెళ్లి పై ఇచ్చిన క్లారిటీతో మీడియా కామ్ అయ్యింది కానీ... లేదంటే విగ్నేష్ శివన్ చెప్పినట్టుగా మీడియా ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి చేస్తూనే ఉండేది. అయితే ఈ ప్రేమ పక్షులు పుట్టిన రోజులకి, స్పెషల్ డేస్ కి విదేశాల్లో వాలిపోయి భారీగా ఖర్చు పెట్టి భారీగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ప్రియుడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజునాడు ఈ ప్రేమ పక్షులు రెండూ గోవాలో వాలాయి. గోవా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ జంట పక్షులని ఫోటో గ్రాఫర్స్ వదలకుండా క్లిక్ మనిపించారు. ఇక గోవాలో నయనతార, విగ్నేష్ శివన్ పుట్టిన రోజున ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసింది. అక్కడ గాన భజానా, కేక్ కటింగ్ అబ్బో మూడు రోజుల పాటు ఈ ప్రేమ పక్షులు గోవాలో బాగా ఎంజాయ్ చేసారు. అయితే నయనతార గోవాలో ఉన్న మూడు రోజులు విగ్నేష్ శివన్ పుట్టినరోజుకి ఏకంగా 25 లక్షలు ఖర్చు పెట్టిందట. టాప్ హీరోయిన్ నయన్ 25 లక్షలు ఖర్చు పెట్టడం వింతేమీ కాదు... కానీ పెళ్లి కాకుండా ప్రియుడి కోసం ఆ రేంజ్ ఖర్చు పెట్టడమే కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. 

Nayanthar Spent 25 lakhs for Her Lover Birthday :

Nayanthara celebrates her Lover Vignesh Birthday at Goa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs